ఉద్యోగం రాలేదని బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య | Did not get the job BTech student commits suicide | Sakshi
Sakshi News home page

ఉద్యోగం రాలేదని బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

Published Thu, Sep 22 2016 10:14 PM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM

ఉద్యోగం రాలేదని బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

ఉద్యోగం రాలేదని బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

చిలకలగూడ: ఉద్యోగం రాలేదని మనస్తాపంతో బీటెక్‌ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చిలకలగూడ పోలీసుల కథనం ప్రకారం.. శ్రీనివాసనగర్‌కు చెందిన ప్రబంధ (20) సైదాబాద్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. ఇటీవల మూడు ఎంఎన్ సీ కంపెనీల్లో ఇంటర్వ్యూలకు హాజరైంది. ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది.

ఎప్పటిలాగే బుధవారం రాత్రి ఇంట్లోని తన గదిలోకి వెళ్లి పడుకున్న ప్రబంధ గురువారం ఉదయం 6 గంటలకు తల్లి నిద్రలేచి చూసేసరికి చున్నీతో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. కుటుంబసభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్టు  వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు తండ్రి సురేందర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement