జిల్లాకు 80 వేల పాఠ్యపుస్తకాలు
Published Fri, Jul 29 2016 10:26 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
విద్యారణ్యపురి : జిల్లాకు కొత్తగా పలు తరగతులకు సంబంధించి అన్ని టైటి ల్స్ కలిపి 80 వేల పాఠ్యపుస్తకాలు వచ్చాయని డీఈఓ పి.రాజీవ్ తెలిపా రు. ఈ విద్యాసంవత్సరం ఆరంభం లోనే 15లక్షలకు పైగా ఉచిత పాఠ్యపుస్తకాలు రాగా పంపిణీ చేశారు. అయి తే, పలు పాఠశాలల్లో పుస్తకాలు సరి పోలేదని, అదనంగా మరికొన్ని పుస్తకాలు కావాలని ఎంఈఓల ప్రతిపాదనలతో డీఈఓ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఈమేరకు పుస్తకాలు చేరుకున్నాయి. ఏయే పాఠశాలల విద్యార్థుల కు పుస్తకాలు తక్కువ పడ్డాయో వివరాలతో హెచ్‌ఎంలు డీఈవో కార్యాల యానికి వచ్చి అవసరమైన పుస్తకాలు తీసుకెళ్లాలని డీఈవో సూచించారు.
Advertisement
Advertisement