
వివాహం ఇష్టం లేక..!
► ఇంటి నుంచి నంద్యాల రైల్వే స్టేషన్‌కు
► యువతిని తల్లిందండ్రులకు అప్పగించిన పోలీసులు
నూనెపల్లె: చదువుకుంటానంటే వద్దంటూ వివాహం చేయడంతో నచ్చక ఇంటి నుంచి ఓ యువతి పారిపోయి నంద్యాల రైల్వే స్టేషన్‌కు వచిచది. ఇక్కడి పోలీసులు కనుగొని ఆమెను కు టుంబ సభ్యులకు అప్పగించా రు. ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ నారాయణస్వామి వివరాల మేరకు.. తుగ్గలి మండలం ఎల్లమ్మగుట్ట తండాకు చెందిన స్వామినాయక్ కుమార్తె మురావత్ సంధ్య పాణ్యం మండలం నెరవాడ హాస్టల్‌లో ఇంటర్ పూర్తి చేసింది. తాను ఉన్నత చదువులు చదువుతానంటూ తల్లిదండ్రులకు చెప్పినా వారు మాట వినక అదే గ్రామానికి చెందిన శంకర్‌నాయక్‌తో రెండు నెలల క్రితం వివాహం చేశారు.
వద్దన్నా వినకుండా పెళ్లి చేయడంతో ఆదివారం ఇంటి నుంచి పారిపోయి ఆమె నంద్యాలకు చేరుకుం ది. ఎటు వెళ్లాలో తెలియక అదే రోజు రాత్రి రైల్వే స్టేషన్‌లో తిరుగుతుం డగా.. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విషయం వెలుగులోకి రావడంతో అమ్మాయిను కుటుంబ సభ్యులకు అప్పగించారు.