పిఠాపురం వైద్యుడికి జాతీయ స్థాయి ర్యాంకు
పిఠాపురం టౌన్:
స్థానిక కత్తుల గూడానికి చెందిన వైద్యుడు దంగేటి గురుకిరణ్‌కు సైన్స్ అండ్ రీసెర్చ్ ప్రతిభా పరీక్షలో జాతీయ ర్యాంకు సాధించారు. బెంగళూరు జయదేవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కిలర్ సైన్స్ రీసెర్చ్‌కు సంబంధించిన అఖిల భారత పరీక్షలో గురుకిరణ్ 15వ ర్యాంకు సాధించినట్టు ఆయన తల్లిదండ్రులు వీరాస్వామి, వెంకటలక్ష్మి ఆదివారం తెలిపారు. ఎండీ పూర్తి చేసిన గురుకిరణ్ కార్డియోలో ప్రత్యేక నిపుణుడిగా గుర్తింపు పొందేందుకు ఈపరీక్ష రాసినట్టు వారు తెలిపారు. గురుకిరణ్‌కు పలువురు అభినందనలు తెలిపారు.