కుక్కల దాడిలో 14 మందికి గాయాలు
Published Sat, Nov 5 2016 11:43 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM
తుని :
తుని, పాయకరావుపేట నియోజకవర్గాల పరిధిలో వీధి కుక్కలు స్వైరవిహారం చేసి 14 మందిని గాయపరిచాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ తునిపట్టణం, పాయకరావుపేట, ఎస్.అన్నవరం, పైడికొండ, రౌతులపూడి తదితర ప్రాంతాలకు చెందిన బాధితులు తుని ఏరియా ఆస్పత్రిలో వైద్యం పొందారని వైద్యులు తెలిపారు. పట్టణంలోని డ్రైవర్స్ కాలనీ, కొట్టాం సెంటర్‌లో తొమ్మిది మందికి, మరో ఐదుగురు వివిధ గ్రామాలకు చెందినవారు కుక్కకాటుకు గురైన వారిలో ఉన్నారు. పట్టణానికి చెందిన వి.కృష్ణనాగరాజు, కల్కిభగవాన్, ఎస్‌కే యాకోబు, కె.శ్రీను, ఎస్.సుధాకర్, పి.సత్తిబాబు, విజయభారతి, కె.రమణమ్మ, కె.సత్యవతికి ఏఆర్వీ ఇంజెక్షన్లు ఇచ్చామని ఆస్పత్రి సూపరింటెండెంట్ లక్ష్మణరావు తెలిపారు.
Advertisement