బహిరంగ విచారణకు సిద్ధం కావాలి
Published Sun, Jul 24 2016 7:04 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు(పొగతోట): మాపై ఆరోపణలు చేస్తున్న వారు బహిరంగ విచారణకు సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(ఏపీఆర్‌ఎస్‌ఏ) అధ్యక్ష, కార్యదర్శులు షఫిమాలిక్, కాలయ సతీష్‌కుమార్ అన్నారు. ఆదివారం ఏపీఆర్‌ఎస్‌ఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అసోసియేషన్‌ను అడ్డుపెట్టుకుని స్వార్థప్రయోజనాల కోసం పాకులాడుతున్న నాయకులు రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమానికి కషి చేస్తున్న మాపై ఆరోపణలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్నామని, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనే సంకల్పంతోనే కావలి, ఆత్మకూరు, గూడూరు డివిజన్లకు ఎన్నికలు పూర్తి చేశామని తెలిపారు. బదిలీల ప్రక్రియ జరుగుతున్నందున ఎన్నికల నిర్వహణ జాప్యం జరిగిందన్నారు. నెల్లూరు డివిజన్‌కు ఈ నెల 28న నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఆగస్టు 7న నామినేషన్లు స్వీకరించి 14న ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. నెల్లూరు డివిజన్‌కు కాయల సతీష్‌కుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారన్నారు. ఎన్నికల ప్రక్రియ నెల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఏపీఆర్‌ఎస్‌ఏ నాయకులు డి.శ్రీరామకష్ణ, టి.శ్రీనివాసులు, ఎంఎం ప్రసాద్, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
Advertisement
Advertisement