పిల్లల హక్కులు కాలరాయొద్దు
కడప ఎడ్యుకేషన్:
పిల్లల హక్కులను తల్లితండ్రులు , ఉపాధ్యాయులు కాలరాయొద్దని, వారిని సత్పవర్తన గల వారిగా తీర్చిదిద్దాలని లీగల్ సర్వీసెస్ అధారిటి జిల్లా సెక్రెటరీ యుయు ప్రసాద్ పేర్కొన్నారు. కడప నగరం డీసీఈబీలో శుక్రవారం జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోతన్న, ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు, ఎంఈఓలు, ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లకు ( అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు) లీగస్ సెల్ అవగాహన సదస్సు జరిగింది. ఇటీవల జిల్లాలోని పలు పాఠశాలలో విద్యార్థులపై ఉపాధ్యాయులు చేస్తున్న డాడుల దృష్ట్యా సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన లీగల్ సర్వీసెస్ అధారిటి జిల్లా సెక్రెటరీ యుయు ప్రసాద్ మాట్లాడుతూ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 17 ప్రకారం పిల్లలను శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేయకూడదన్నారు.పిల్లలకు కార్పోరల్ పనిష్మెంట్ ఇవ్వకూడదన్నారు.
పిల్లలలో న్యూనతా భావాన్ని తొలగించి ప్రయోజకులుగా చేయాల్సిన బాధ్యత తల్లితండ్రుల కంటే ఉపాధ్యాయులకే ఎక్కువ ఉందన్నారు. నేటికి చాలా పాఠశాలల్లో స్టడీ అవర్స్ అని పిల్లలను వత్తిడికి గురి చేస్తున్నారన్నారు. డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో కడప జిల్లాను ్రఫ్రీ ³నిస్మెంట్ జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ ప్రజన్నాంజనేయులు, ఆర్‌ఐపీఈ బానుమూర్తిరాజు, ఎంఈఓ నాగమునిరెడ్డి, మోధావుల సంఘం జిల్లా అ«ధ్యక్షుడు వివేకానందరెడ్డి, అపూస్మా జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి బాలగంగయ్యతోపాటు పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పలు పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.