పుష్కరాల్లో బాధ్యతగా పనిచేయండి
పుష్కరాల్లో బాధ్యతగా పనిచేయండి
Published Mon, Aug 8 2016 10:15 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
విజయవాడ : పుష్కరాల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, అధికారులు అలసత్వం వహించకుండా బా«ధ్యతాయుతంగా పని చేయాలని మున్సిపల్ కమిషనర్ జి. వీరపాండియన్ కోరారు. సోమవారం గాంధీనగర్‌లో కందుకూరి కళ్యాణ మండపంలో పుష్కర విధులకు హాజరయ్యే సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిబ్బంది విధి విధానాలపై మున్సిపల్ కమీషనర్ దిశా నిర్దేశం చేశారు. వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుండి వచ్చిన అదికారులు, సిబ్బందితో పాటు నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులకు 3 షిప్టులుగా 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. పుష్కరనగర్‌లు, పుష్కర ఘాట్‌లలో మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకొను గదులు, తాగునీటి సరఫరా తదితర ప్రధానమైన మౌళిక సదుపాయాలపై ఎటవంటి ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు టాయిలెట్లను ఫినాయిల్, బ్లీచింగ్‌లతో పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఘాట్‌ల వద్ద షిప్టు వారీగా విధులు నిర్వహించే వారు తరువాత షిప్ట్‌నందు సిబ్బంది వచ్చే వరకు విధులలో ఉండి ఆ ఘాట్‌లకు సంబంధించిన పూర్తి సమాచారం అందించి విధుల నుండి రిలీవ్ అవ్వాలన్నారు. నగర పాలక సంస్థ అధికారులతో పాటు వివిధ మున్సిపాలిటీల నుండి వచ్చిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement