ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దు
నిజామాబాద్ నాగారం:
జిల్లాల విభజన నేపథ్యంలో ఉద్యోగులంతా పగలూరాత్రి తేడా లేకుండా విధులు నిర్వహిస్తుంటే, కొంత మంది అధికారులు ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలపై మంగళవారం టీఎన్జీవోఎస్ భవన్‌లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆ యన మాట్లాడారు. వ్యవసాయంతో పాటు పలు శాఖల్లోని కొంత మంది అధికారులు ఉద్యోగులను కావాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, సస్పెండ్ చేస్తామని బెదరిస్తున్నట్లు తెలిసిందన్నారు. కలెక్టర్ ఆదేశాల మే రకు సెలవులతో పాటు రాత్రి కూడా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఉద్యోగులకు తాము అండగా ఉన్నామని చెప్పారు.
తాత్కాలికంగా ఆర్డర్లు తీసుకోవాలి
జిల్లాల విభజన నేపథ్యంలో ఉద్యోగులు వేరే జిల్లాకు వేళ్లేందుకు తాత్కలికంగా ఆర్డర్లు తీసుకోవాలని కిషన్ సూచించారు. అక్కడ సరిపడా సిబ్బందిని నియమించిన తర్వాత మళ్లీ ఉద్యోగుల అభీష్టం మేరకు ఆయా జిల్లాల్లో విధులు నిర్వహించేలా చూస్తామన్నారు. నూతన జిల్లాలో ఏర్పడే కార్యాలయాల్లో ఉద్యోగులకు కావాల్సిన అన్ని మౌలిýS సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు.
టీఎన్జీవోస్ కేంద్ర ఉపాధ్యక్షుడిగా నరేందర్
టీఎన్జీవోస్ కేంద్ర ఉపాధ్యక్షుడిగా ఎమ్‌బీ నరేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన సోమవారం నియామకపత్రం అందుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నగరంలోని టీఎన్జీవోస్ భవన్‌లో ఆయనను ఘనంగా సత్కరించారు. ఆయన పుట్టిన రోజు కూడా కావడంతో కేక్ కేట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, రాష్ట్ర కార్యదర్శి నరేందర్, ఉపాధ్యక్షులు అమృత్‌కుమార్, నరహరి, సుధాకర్, నగర అధ్యక్ష, కార్యదర్శులు సుమన్, సత్యనారాయణ, జగదీష్ పాల్గొన్నారు.