ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో ఇంగ్లిష్ విద్య ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఓ పక్క కృషి చేస్తుంటే.. మరో పక్క ఉన్న సక్సెస్ స్కూల్‌లో ఆంగ్లం బోధించలేమంటూ ఉపాధ్యాయులు తేల్చిచెబుతున్నారు. డబుల్ ప్యాట్రన్ లేకపోయినా ఇన్నాళ్లూ పాఠశాలను నెట్టుకొచ్చాం.. ఇక మా వల్లకాదని చేతులెత్తేశారు ఏదుట్ల పాఠశాల ఉపాధ్యాయులు.
- గోపాల్‌పేట
మండలంలో రెండు సక్సెస్ స్కూళ్లు ఉండగా ఏదుట్ల హైస్కూల్‌లో ఈ ఏడాది ఇంగ్లిష్ మీడియం అడ్మిషన్లు తీసుకోవడానికి ఉపాధ్యాయులు నిరాకరిస్తున్నారు. ఎనిమిదేళ్ల నుంచి కొనసాగుతు న్న ఆంగ్ల బోధనను ఉన్నపలంగా నిలిపివేస్తే మా పిల్లల భవిష్యత్ ఏం కావాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుండగా ప్రస్తుతం సక్సెస్ స్కూ ల్‌లో తె లుగు, ఇంగ్లిష్ మీడియంలో మొత్తం 300 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్క ఇంగ్లిష్‌లోనే 122 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
కొత్తగా 6వ తరగతిలో ప్రవేశం కోసం 54 మంది విద్యార్థులు దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇందులో స గం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చేరడానికే ఇష్టపడుతున్నారు. అ యితే ఈ ఏడాది ఇంగ్లిష్ మీడియం కొనసాగిస్తే తమపై అదనపు భారం పడుతుందని ఉపాధ్యాయులు ఇందుకు ఇష్టపడడం లేదు. వచ్చిన విద్యార్థులను తె లుగు మీడియంలో చేర్చుకోవడానికి సిద్ధమవగా తల్లిదండ్రులు అడ్డుకున్నారు.
మేం ఒప్పుకోం : గ్రామస్తులు
ఎప్పటిలాగే సక్సెస్ స్కూల్‌లో ఇంగ్లిష్ మీడియం కొనసాగించాల్సిందేనని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సర్పంచ్ నారాయణయాదవ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు పలుమార్లు ఉపాధ్యాయులను నిలదీశారు. ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థులను ఎందుకు చేర్చుకోవడం లేదని జీహెచ్‌ఎం సీఎస్ రాజును ప్రశ్నించారు. అలాగే ఎమ్మెల్యేతోపాటు ఎంఈఓలకు వినతిపత్రాలు కూడా అందించారు.
ఇన్నాళ్లు బాగానే బోధించిన ఉపాధ్యాయులు ఇప్పుడు ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మాలాంటి పేద పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో వేలల్లో ఫీజులు చెల్లించి ఇంగ్లీష్ చదుకోలేరని, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామంటే అవకాశం ఇవ్వడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.
ఉపాధ్యాయులు అవసరం
ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులు తమపై అదనపు భారం పడుతుందని ఇంగ్లిష్ మీడియంపై ఆసక్తి కనబరచడంలేదు. డిప్యూటేషన్‌పై ఇద్దరు ఉపాధ్యాయులుకాని, విద్యావలంటీర్లను గాని ఏర్పాటు చేస్తే ఇంగ్లిష్ మీడియం కొనసాగించడానికి సాధ్యమవుతుంది.
- రాజు, జీహెచ్‌ఎం, ఏదుట్ల పాఠశాల
నా పరిధిలో లేదు
ఏదుట్ల సెక్సెస్ హైస్కూల్‌లో ఇంగ్లీష్ మీడియం కొనసాగాలంటే ఉపాధ్యాయులు అవసరం. వారి నియామకం నా పరిధిలో లేదు. గ్రామస్తులు సహకరించి ఇద్దరు విద్యా వలంటీర్లను నియమించడానికి ఆర్థికంగా సహకరిస్తే ఇంగ్లిష్ మీడియం కొనసాగే వీలుంది.
- సరస్వతీబాయి, ఎంఈఓ, గోపాల్‌పేట
‘ఆంగ్లం’ బోధించలేం!
Published Wed, Jun 29 2016 8:41 AM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM
Advertisement