సీఎం మనువడి పుట్టువెంట్రుకలు సమర్పణ
నారావారిపల్లెలో కార్యక్రమం
చంద్రగిరి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మనువడు, లోకేశ్, బ్రహ్మణిల తనయుడు దేవాన్ష్ పుట్టువెంట్రుకలు తీసే కార్యక్రమం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో శుక్రవారం నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు సీఎం కుటుంబ సమేతంగా తమ స్వగ్రామంలోని కులదైవం నాగాలమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. శాస్త్రోక్తంగా నాగాలమ్మకు పూజలు నిర్వహించి, దేవాన్ష్‌కు పుట్టు వెంట్రుకల తొలగింపు కార్యక్రమం పూర్తిచేశారు.
ఈ కార్యక్రమానికి బాలకృష్ణ దంపతులు, సీఎం సోదరుడు రామ్మూర్తినాయుడు దంపతులు, కొద్దిమంది రాజకీయ నాయకులు హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తన కుమారుడు లోకేశ్ పుట్టువెంట్రుకలు కూడా నాగాలమ్మకు సమర్పించామని, దేవాన్ష్‌కూ అదే సంప్రదాయాన్ని కొనసాగించామన్నారు.