మంత్రి చెబితేనే కదలిక.. | eveteasers harassment interstudents | Sakshi
Sakshi News home page

మంత్రి చెబితేనే కదలిక..

Published Mon, Mar 6 2017 11:36 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

మంత్రి చెబితేనే కదలిక..

మంత్రి చెబితేనే కదలిక..

కుమార్తెలపై ఆకతాయిల వేధింపులు
పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన నిల్‌
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తండ్రి 
హోం మంత్రి ఆదేశాలతో కదిలిన పోలీసు యంత్రాంగం
 
ఇద్దరు ఆడపిల్లలు ... అమలాపురంలో ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు...వీరిని ఆకతాయి యువకులు వేధింపులకు పాల్పడు తున్నారు...అసభ్యంగా ప్రవర్తించడంతో తండ్రి మందలించాడు. తమ తప్పులను సరిదిద్దుకోని ఆ యువకులు తండ్రినే చంపేస్తామని బెదిరింపులకు దిగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోగా ఆ యువకుల బెదిరింపులు ఎక్కువవడంతో ఆత్మహత్యా యత్నానికి గత నెల 24న పాల్పడ్డాడు. అయినా రక్షక భటుల్లో కదలిక లేదు. చివరకు మంత్రి  చిన రాజప్ప దృష్టికి వెళ్తేగానీ పోలీసుల్లో చలనం కలగలేదు. 
–అమలాపురం టౌన్‌
ఇంటరీ్మడియట్‌ చదువుతున్న తన ఇద్దరి ఆడపిల్లలపై అల్లరి మూకలు బెదిరింపులకు పాల్ప డి, వేధిస్తుం డడంతో ఆందో ళన చెందిన ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసు కేసు పెట్టిన తర్వాత ఆ యువకుల వేధింపులు.. బెదిరిం పులు మరింత ఎక్కువయ్యాయి. కేసు ఉపసంహరించుకోకపోతే చంపేస్తామంటూ హెచ్చరించారు. సెల్‌ఫోన్‌ వాట్సాప్‌లో కత్తులు చూపిస్తూ ఉన్న ఫొటోలతో యువకులు బెదిరించడంతో మనస్తాపం చెందిన ఆ తండ్రి పురుగు ముందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.   దీంతో బాధిత కుటుం బం, బంధువులు హోం మంత్రి రాజప్ప ను ఆశ్రయించారు. ఆయన పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఎట్టకేలకు ఆ యువకులపై కేసు నమోదు చేసి చర్యలకు సిద్ధమవుతున్నారు.
అమలాపురం పట్టణంలోని గొల్లగూడేనికి చెందిన గుర్రం రాజా రమేష్‌ ఇద్దరి కుమార్తెలు ఇంటరీ్మడియట్‌ చదువుతున్నారు. కొందరు యువకుల వారిని వేధించి, బెదిరించడంతో రాజారమేష్‌  పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదులో జాప్యం, యువకులు బెదిరింపులకు భయపడి మనస్తాపంతో ఆత్యాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం కిమ్స్‌ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఐసీయూలో వైద్యం పొందుతున్నాడు. బాధితుడు రాజా రమేష్, అతడి భార్య, బంధువుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రాజా రమేష్‌ తన ఇద్దరు ఆడ పిల్లలు పట్టణంలోని ఓ కళాళాలలో ఇంటరీ్మడియట్‌ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం చదువుతున్నారు. అందులో ఓ అమ్మాయికి, కిమ్స్‌ ఆస్పత్రి సమీపంలో గల అబ్బిరెడ్డి కాలనీకి చెందిన ఆ యువకుడి మధ్య ప్రేమ నడుస్తోంది. విషయం తెలిసిన రాజారమేష్‌ తన కుమార్తెలను మందలించి, ఆ యువకుడిని హెచ్చరించారు. కక్ష పెంచుకున్న ఆ యువకుడు తన ఇద్దరి స్నేహితులతో రాజా రమేష్‌కు తరచూ ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. డీఎస్పీ లంక అంకయ్యను రమేష్‌ స్వయంగా కలసి తన బాధను వెళ్లగక్కుకున్నారు. ఆయన రూరల్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయమన్నారు.  గత నెల 21న పోలీసు స్టేషన్‌లో ఆ ముగ్గురు యువకులపై ఫిర్యాదు చేశాడు.ఇంతలో ఆ కాలనీ పెద్దలు తాము రాజీ చేస్తామంటూ ముందుకు రావటంతో పోలీసులు ఈ కేసును అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఈ లోగా ఆ ముగ్గురు యువకుల నుంచి వేధింపులు, బెదిరిం పులు మరింత ఎక్కువయ్యాయి. ‘మీ తండ్రిని చంపేస్తామం టూ’ తరచూ సిమ్‌లు మార్చుతూ కత్తులు చూపిస్తున్న ఫొటోలను వాట్సాప్‌ ద్వారా ఈ అమ్మాయిలకు పంపించా రు. దీంతో మనస్థాపానికి గురైన రమేష్‌ గత నెల 24న పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
కదిలిన పోలీసులు
బాధిత కుటుంబీకులు, బంధువులు అమలాపురంలో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పను ఆదివారం కలిసి తమ సమస్యను చెప్పుకున్నారు. దీంతో రాజప్ప పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కేసు నమోదు చేసి ఆ కుర్రాళ్లను అరెస్ట్‌ చేయాలని ఆదేశించారు. కేసు నమోదు చేసి యువకులను అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ విషయమై తాలూకా ఎస్సై గజేంద్రకుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ‘ బాధిత కుటుంబీకులు తన వద్దకు వచ్చారని, యువకులను పిలిచి హెచ్చరించి వదిలేయండి, కేసు వద్దు అన్నట్టుగా చెప్పారని వివరించారు. కిమ్స్‌ నుంచి ఎమ్మెల్సీ పత్రం వచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నకు తమకు ఆలస్యంగా అందిందని చెప్పారు. ఇదే విషయాన్ని కిమ్స్‌ ఆస్పత్రిలో ఎమ్మెల్సీ కేసులను పర్యవేక్షించే అధికారి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించినప్పుడు రాజారమేష్‌కు ఆస్పత్రిలో వైద్యం మొదలు పెట్టిన రోజే ( గత నెల 24న) ఎమ్మెల్సీ పత్రాన్ని తాలూకా పోలీసు స్టేష¯ŒSకు పంపించామని చెప్పడ కొసమెరుపు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement