కరెంట్ షాక్తో రైతు మృతి | Farmer died due to electric shock in nalgonda District | Sakshi
Sakshi News home page

కరెంట్ షాక్తో రైతు మృతి

Published Fri, Aug 14 2015 3:05 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

Farmer died due to electric shock in nalgonda District

నల్గొండ : నల్లగొండ జిల్లా నూతనకల్ మండలం కొత్తగూడలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ లేకపోవడంతో ట్రాన్స్‌ఫారానికి మరమ్మతులు చేస్తూ ఓ రైతు అక్కడికక్కడే మరణించగా... మరో ఇద్దరు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోట చేసుకుంది. వ్యవసాయ పొలంలో ట్రాన్స్‌ఫారం పని చేయడం లేకపోవడంతో రైతులు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో లైన్‌మెన్ గురువారం వచ్చి సదరు ట్రాన్స్ఫార్మర్ను పరిశీలించి వెళ్లాడు.

అయిన ట్రాన్స్ఫార్మర్లో విద్యుత్ సరఫరా రాకపోవడంతో ఈ రోజు సంగసాని రవీందర్, బానోతు బాలు, సంగసాని వేణు ట్రాన్స్‌ఫారం మరమ్మతు చేసేందుకు యత్నించారు. ఆ క్రమంలో విద్యుత్ షాక్‌తో రవీందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుకు తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన వేణు సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, బాలు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement