హృదయ విదారకం | father and daughter died in road accident | Sakshi
Sakshi News home page

హృదయ విదారకం

Published Wed, Sep 7 2016 12:51 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

హృదయ విదారకం - Sakshi

హృదయ విదారకం

= చవితి రోజున అపశ్రుతి
= రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి
= శోక సంద్రంలో కొత్తచామలపల్లి ఎస్సీ కాలనీ


చిలమత్తూరు : వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అక్కకు పసుపు కుంకుమలు ఇచ్చి కొన్ని నిమిషాల్లో స్వగ్రామం చేరుకుంటున్నారనే సమయంలో టాటా ఏస్‌ ఆటో రూపంలో మృత్యువు తండ్రి, కూతురి ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన సోమవారం మండలంలోని ఓబుళాపురం క్రాస్‌ వద్ద చోటు చేసుకుంది. ఎస్‌ఐ జమాల్‌బాషా, స్థానికులు తెలిపిన వివరాల మేరకు స్థానిక పంచాయతీలోని కొత్తచామలపల్లి ఎస్సీ కాలనీకి చెందిన రామచ్రందప్ప (48) యానిమేటర్‌గా పని చేస్తున్నాడు.

పండుగ సందర్భంగా తన అక్కకు పసుపు కుంకమలు ఇవ్వడానికి కుమార్తె పూజ (7)తో కలిసి బైకుపై మడకశిర ప్రాంతంలోని కేతిపల్లి గ్రామానికి వెళ్లారు. అక్క నాగమ్మకు పసుపు, కుంకుమలు ఇచ్చి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఓబుళాపురం క్రాస్‌ సమీపంలో చేనేపల్లి గ్రామం నుంచి హిందూపురం వైపు ఎద్దులను తరలిస్తున్న టాటా ఏస్‌ ఆటో ఢీకొంది. దీంతో బైకులో ఉన్న పూజ అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడ్డ రామచంద్రప్పను చికిత్స నిమిత్తం హిందూపురం ఆస్పత్రికి తరలించారు.

కాగా ఆస్పత్రిలో రామచంద్రప్ప మరణించారు. పండుగ సమయంలో విషాదం చోటు చేసుకోవడంతో మృతుడి కుటుంబ సభ్యులు గంగులమ్మ, జ్యోతి కన్నీరు మున్నీరయ్యారు. కొత్తచామలపల్లి ఎస్సీ కాలనీ శోక సంద్రంలో మునిగిపోయింది. సంఘటన స్థలాన్ని పరిశీలించి పూర్వపరాలు సేకరించి, కేసు నమోదు చేసి ఆటోను, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement