కోదాడ(నల్లగొండ): విద్యుధ్ఘాతానికి గురై తండ్రీ కూతుళ్లు మృతిచెందిన సంఘటన నల్లగొండ జిల్లా కోదాడ రూరల్ మండలం గొండ్రియాలలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమ(31) బట్టలు ఆరేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఇనుప తీగకు విద్యుత్ సరఫరా జరిగి కరెంట్ షాక్‌కు గురైంది. ఇది గుర్తించిన తండ్రి వెంకటేశ్వర్లు(55) ఆమెను కాపాడటానికి ప్రయత్నించే క్రమంలో అతడికి కూడా షాక్ కొట్టడంతో.. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఒకే ఇంటికి చెందిన ఇద్దరు మృత్యువాతపడటంతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
విద్యుధ్ఘాతానికి తండ్రీ కూతుళ్లు మృతి
Published Fri, Jun 24 2016 7:47 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
Advertisement
Advertisement