మద్యం మత్తులో చిన్నారిని చంపేశాడు | father killed his four months son | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో చిన్నారిని చంపేశాడు

Published Mon, Mar 28 2016 8:36 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

father killed his four months son

డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి నాలుగు నెలల కుమారుడ్ని గొంతు పిసికి చంపేశాడు. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఇసుకపల్లి నవీన్, మమతకు రెండేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి నాలుగు నెలల రిషివర్ధన్ అనే బాబు ఉన్నాడు.

కూలీ పనులు చేసుకునే నవీన్ తాగుడుకు బానిసగా మారాడు. ఆదివారం రాత్రి కూడా తాగి వచ్చిన నవీన్ భార్య మమతతో గొడవపడ్డాడు. అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న చిన్నారిని గొంతు పిసికి ప్రాణం తీశాడు. సోమవారం ఉదయం బాలుడు నిర్జీవంగా కనిపించేసరికి మమత భోరుమని విలపించింది. పోలీసులు నవీన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement