తండ్రిని కత్తితో పొడిచి చంపిన కొడుకు | Father killed by son for property | Sakshi
Sakshi News home page

తండ్రిని కత్తితో పొడిచి చంపిన కొడుకు

Published Mon, Jun 20 2016 8:35 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

తండ్రిని కత్తితో పొడిచి చంపిన కొడుకు - Sakshi

తండ్రిని కత్తితో పొడిచి చంపిన కొడుకు

పిడుగురాళ్ల: ఆస్తి కోసం కన్నకొడుకే తండ్రిని దారుణంగా హతమార్చిన సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుంచెం చిన వెంకయ్య(52) తనకున్న ఎకరం భూమని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో గత కొన్ని రోజులుగా భూమిని తనకా పెట్టి లక్ష రూపాయలు ఇవ్వాల్సిందిగా కొడుకు అడుగుతున్నాడు. దీనికి తండ్రి నిరాకరిస్తూ వస్తున్నాడు. దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న కొడుకు వెంకటేశ్వర్లు ఆదివారం మద్యం మత్తులో కత్తితో అతని పై దాడి చేశాడు. ఇది గుర్తించిన అతని పెద్దమ్మ, పెదనాన్న, అక్క, బావమరిది అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. విచక్షణా రహితంగా వారి పై కూడా దాడి చేశాడు.

ఈ దాడిలో వెంకయ్య అక్కడికక్కడే మృతిచెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement