‘బాపూ’ని తీసి.. బాబు ఫ్లెక్సీ కట్టి.. | Father of the Nation Mahatma Gandhi statue removed | Sakshi
Sakshi News home page

‘బాపూ’ని తీసి.. బాబు ఫ్లెక్సీ కట్టి..

Published Thu, Aug 11 2016 9:10 AM | Last Updated on Tue, Oct 2 2018 7:28 PM

‘బాపూ’ని తీసి.. బాబు ఫ్లెక్సీ కట్టి.. - Sakshi

‘బాపూ’ని తీసి.. బాబు ఫ్లెక్సీ కట్టి..

తాడేపల్లి : దేవాలయాలు, మసీదులు, మహాత్ముల విగ్రహాలను కూల్చేసే కార్యక్రమాలను చంద్రబాబు ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగిస్తోంది. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో జాతిపిత విగ్రహాన్ని కూల్చివేసి బుడమేరు కాలువలో పడవేసిన ఘటన మర్చిపోక ముందే గుంటూరు జిల్లా సీతానగరంలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని తొలగించారు. ఈ సారి అదే స్థానంలో ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బొమ్మలతో ఫ్లెక్సీలు పెట్టడం విశేషం.

పుష్కర ఏర్పాట్లకు మహాత్మాగాంధీ విగ్రహం అడ్డు వచ్చిందంటూ అధికారులు తొలగించారు. అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో మహాత్మాగాంధీ విగ్రహం తొలగింపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై పోరాడడంతో తిరిగి జాతిపిత విగ్రహాన్ని పున:ప్రతిష్టించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement