ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడి వీరంగం | fighting between ashrama school teachers | Sakshi
Sakshi News home page

ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడి వీరంగం

Published Wed, Jul 20 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

fighting between ashrama school teachers

  • ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడి మధ్య ముదిరిన వివాదం
  • కార్యాలయంలో ఫర్నీచర్, కుర్చీలు పడేసి విద్యార్థుల సమక్షంలోనే రణరంగం
  • ఉపాధ్యాయుడిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు
  • నార్నూర్‌ : ఇంట్లో పెద్దలు ఎలా మెదులుతారో పిల్లలూ అలాగే తయారవుతారు.. స్కూల్లో ఉపాధ్యాయుల నడవడికనే విద్యార్థులు అలవర్చుకుంటారు. ఓపికగా విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు చిల్లరగా ప్రవర్తిస్తే విద్యార్థులకు చెడు సందేశం అందించినవారవుతారు. ఇలాంటి ఘటనే నార్నూర్‌ మండలంలోని మాన్కాపూర్‌ ఆశ్రమోన్నత పాఠశాలలో జరిగింది. విద్యార్థుల సమక్షంలో ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడికి మధ్య ఘర్షణ జరిగింది. ఏం చేయాలో తోచక విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.
    విద్యార్థుల సమక్షంలో వీరంగం సృష్టించి ప్రధానోపాధ్యాయుడి కార్యాలయంలో ఉన్న టెబుల్స్, కూర్చీలను కిందకు పడేసి రణరంగం సష్టించారు మాన్కాపూర్‌ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు.
    మాన్కాపూర్‌ ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న బయోసైన్స్‌ ఉపాధ్యాయుడు పవార్‌ విజయ్‌కూమార్, ప్రధానోపాధ్యాయుడు దేవ్‌సింగ్‌ మధ్య గత కొన్ని రోజులుగా వివాదం నెలకొంది. విధి నిర్వహణలో భాగంగా ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు ప్రతి రోజూ ఇద్దరు ఉపాధ్యాయులు నైట్‌  డ్యూటీలు చేయాల్సి ఉంది. ప్రతి రోజు ఉపాధ్యాయులంతా ప్రతిజ్ఞ సమయంలో హాజరుకావాలని, లేనిచో సగం రోజు సీఎల్‌ వేయడం జరగుతుందని ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులను హెచ్చరించారు. అందులో భాగంగా పాఠశాల విధులకు ఆలస్యంగా వచ్చిన ఇద్దరు ఉపాధ్యాయులకు సీఎల్‌ వేసిన ప్రధానోపాధ్యాయుడు, మంగళవారం విధులకు ఆలస్యం వచ్చిన ఉపాధ్యాయుడికి సీఎల్‌ వేయడం మరిచిపోయారు. దీంతో కొంత మంది ఉపాధ్యాయులు గైర్హాజరైన ఉపాధ్యాయుడికి సీఎల్‌ ఎందుకు వేయడం లేదని ప్రశ్నిస్తున్న సమయంలో విజయ్‌కుమార్‌ (బయోసైన్స్‌) అనే ఉపాధ్యాయుడు జోక్యం చేసుకుని ఆరు నెలలైనా ఇంక్రిమెంట్‌ ఎందుకు వేయడం లేదని ప్రధానోపాధ్యాయుడితో గోవడకు దిగాడు. ఎస్‌ఆర్‌ బుక్‌ తీసుకువస్తే ఇంక్రిమెంట్‌ వేస్తానని ప్రధానోపాధ్యాయుడు తెలపడంతో ఆవేశంతో సదరు ఉపాధ్యాయుడు కార్యాలయంలో ఉన్న టేబుల్స్, కూర్చీలను కిందకు పడేశారు. విద్యార్థుల చూస్తుండగానే హంగామా సష్టించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. విద్యార్థుల సమక్షంలోనే ఉపాధ్యాయులు గొడవకు దిగడంతో విద్యార్థులు చూస్తూ బిత్తర పోయారు. 
    గ్రామస్తుల ఆగ్రహం : పీవోకు ఫిర్యాదు
    ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుల గోడవ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, సర్పంచ్‌ తొడసం నాగోరావ్, వీటీడీఏ ఉపాధ్యక్షుడు మేస్రం రూప్‌దేవ్, గ్రామ పెద్దలు కొట్నాక్‌ నానాజీలు పాఠశాలను సందర్శించారు. పాఠశాలల నుంచే ఐటీడీఏ పీవో కర్ణన్‌కు ఫోన్‌లో సమాచారం అందించారు. పీవో ఉపాద్యాయుల పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఏటీడబ్ల్యూవో సత్యవతిని పాఠశాలను సందర్శించి సదరు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో ఆమె హూటాహుటిన పాఠశాలకు చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయుల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల సమక్షంలో విచారణ చేపట్టారు. పాఠశాలలో సమస్యలను సష్టిస్తూ ఈ ఘటనకు కారణమైన ఉపాధ్యాయుడు విజయ్‌కూమార్, పాటు మరో ఉపాధ్యాయుడిని ఐటీడీఏకు సరెండర్‌ చేసి ఇతర ఉపాధ్యాయులను నియమించాలని గ్రామస్తులు లిఖిత పూర్వకంగా వినతి పత్రాన్ని అందజేశారు. రెగ్యూలర్‌ వార్డెన్‌ నియమించి సమయ పాలన పాటించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 
    పోలీస్‌స్టేషన్‌లో ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు 
    పాఠశాలలో వీరంగం సష్టించిన ఉపాధ్యాయుడిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దేవ్‌సింగ్, ఏటీడబ్ల్యూవో సత్యవతిలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక పోలిస్‌ స్టేషన్‌లోధిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏటీడబ్ల్యూవో మాట్లాడుతూ పాఠశాలలో జరిగినఘటనపై గ్రామస్తుల సమక్షంలో విచారణ జరిపినట్లు తెలిపారు. సదరు ఉపాధ్యాయుడు జరిగిన తప్పును ఒప్పుకున్నారని, నివేదికను పీవోకు సమర్పిస్తానని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement