-
రూ.7లక్షల గృహోపకరణాల దగ్ధం
నెల్లూరు(క్రైమ్) : గోదాములో అగ్నిప్రమాదం సంభవించి రూ.7 లక్షల గృహోపకరణాలు దగ్ధమైన సంఘటన గురువారం అర్ధరాత్రి ఏసీ సెంటర్‌లో జరిగింది. బెల్లంకొండ కిరణ్‌రాజు ఏసీ సెంటర్‌లో శ్రీనివాస ఎంటర్ ప్రైజస్ దు కాణం నిర్వహిస్తున్నాడు. దుకాణానికి సమీపంలోనే గోదాము ఉంది. అందులో గృహోపకరణాలను నిల్వ ఉంచాడు. గురువారం రాత్రి బాగా పొద్దుపోయే వరకు ఉండి అనంతరం దుకాణం, గోదాముకు తాళం వేసి వెళ్లాడు. ఈ నేపథ్యంలో గోదాములో విద్యుత్ షార్ట్ సర్కూ్యట్ ఏర్పడి అగ్నిప్రమాదం సంభవించింది. బయటకు దట్టమైన పొగ రావడంతో గమనించిన స్థానికులు కిరణ్‌రాజుకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గోదాము తలుపులు తెరిచి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు రూ.7లక్షలు విలువ చేసే గృహోపకరణాలు (టీవీలు, ఫ్రిజ్‌లు, కూలర్లు, ఫర్నీచర్) అగ్నికి ఆహుతైనట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.