ముంచుకొస్తున్న ముప్పు | flood to expats villages | Sakshi
Sakshi News home page

ముంచుకొస్తున్న ముప్పు

Published Wed, Jul 27 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

ముంచుకొస్తున్న ముప్పు

ముంచుకొస్తున్న ముప్పు

  • గోదావరిలో పెరుగుతున్న నీటి మట్టం
  • కోటిలింగాలలో తీరం ఆనుకుని ప్రవహిస్తున్న గోదావరి 
  • తరలివెళ్లాలంటున్న అధికారులు
  • ఆందోళనలో నిర్వాసితులు
  • వెల్గటూరు : గోదావరిలో నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ముంపు గ్రామాల్లోకి ఏ క్షణాన్నైన వరద రావొచ్చు. ఇప్పటికే కోటిలింగాలను నలువైపులా నుంచి వరద నీరు చుట్టుముడుతోంది. ముక్కట్రావుపేట, చెగ్యాం, ఉండెడ గ్రామాల్లో ఎస్సీకాలనీల్లోకి వరదనీరు చేరుకుంటోంది. నిర్వాసితులను తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరో వైపు పునరావాసకాలనీల్లో ఇంకా ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. దీంతో నిర్వాసితుల్లో ఆందోళన మెుదలైంది. 
    మండలంలోని కోటిలింగాలలో పుష్కరఘాట్లు దాదాపుగా గోదావరి వరదలో మునిగిపోతుండగా, పెద్దవాగు నది సంగమ ప్రదేశంలో నుంచి గట్టెక్కింది. వరదనీరు ఆలయ సమీపంలోకి చేరుకుంటుంది. గోదావరిలో వరద ఉధృతి పెరుగుతున్న కొద్దీ గ్రామానికి ఉత్తర దిశలో ఉన్న పెద్దవాగులో నీటి మట్టం పెరిగి దక్షిణం వైపు నుంచి గ్రామాన్ని చుట్టుముడుతోంది. ఇదతతా చూస్తూ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఊరు నుంచి ఎటు పర్లాంగు దూరం వెళ్లేందుకు అవకాశం లేదని ఆందోళన చెందుతున్నారు. అధికారులు కేవలం ఐదు ఇళ్ల కోసమే పునరావాసకాలనీలో ఏర్పాట్లు చేయటం గమనార్హం. మిగతా వారు మా సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. 
     
    నిలిచిపోనున్న రాకపోకలు 
    Ðð ల్గటూరుతో కోటిలింగాలను కలిపేందుకు గతంలో నిర్మించిన లోలెవల్‌ వంతెనకు  వరద నీరు తాకుతోంది. నదిలో నీటి మట్టం ఇలాగే పెరిగితే ఈ రాత్రికే ఈ వంతెను మునిగిపోనుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం సుమారు 145 ఎఫ్‌ఆర్‌ఎల్‌ ఉండగా గోదావరికి ఇరువైపులా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వరద వస్తుంది . ఇంకా నీటి మట్టం పెరిగితే వంతెన మునిగిపోతుంది. కోటిలింగాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి.  
    1995లో వరదలు 
    1995లో గోదావరికి వరదలు వచ్చినప్పుడు గ్రామం వెనక నుంచి నది గట్టు తెగి ఊరిని వరదనీరు చుట్టుముట్టింది. అధికారులు అప్రమత్తమవడంతో సమీపంలోని పాషిగాంకు తరలించారు. అప్పడే పెద్దవాగు పొంగి ముక్కట్రావుపేట వరద ముంపునకు గురైంది. ఇప్పుడు అలాంటి పరస్థితులు ఏర్పడక ముందే ముంపు గ్రామాలను తరలించేందుకు రెవెన్యూ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 
     తాత్కాలిక ఏర్పాట్లు 
    ముంపు గ్రామాల్లో తహసీల్దార్‌ కృష్ణవేణి బుధవారం పరిశీలించారు. ఇప్పటికే గుర్తించిన చెగ్యాంలోని 185 కుటుంబాలను అదే గ్రామంలోని జెడ్పీ హైస్కూల్, ఉండెడలో 15 కుటుంబాలకు అదే గ్రామంలో ఎగువన ఉన్న ఇళ్లు, ముక్కట్రావుపేటలో 9 కుటుంబాలకు అదే గ్రామంలో గదులు అద్దెకు తీసుకున్నారు. కోటిలింగాలలో 5 కుటుంబాలను వెల్గటూరు పునరావాసకాలనీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముంపు గ్రామాలకు మొత్తంగా పరిహారం అందించి పూర్తిస్థాయిలో పునరావాసకాలనీలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పరిహారం పూర్తిగా ఇవ్వకుండా ఎలా తరలిస్తారని నిర్వాసితులు మొండికేస్తున్నారు. ప్రమాదపుటంచున ఉన్న కుటుంబాలను బలవంతంగానైనా తరలిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 
     
    భయమేత్తంది
    వారం రోజుల కిందట గోదావరి గట్టు కింద ఎక్కడో ఉంది. ఇప్పడు గట్టెక్కి ఆలయం వైపునకు వస్తుంటే భయమేత్తాంది. రాత్రి మరింత పెరిగితే గ్రామంలోకి నీళ్లు వత్తాయి. భయంగా ఉంటోంది. 
    – పోలు శంకర్, కోటిలింగాల 
    పశువుల మేతకు కట్టమైతాంది 
    ఊరు చుట్టూ గోదావరి నీరు చుట్టుముడుతాంది. పశువులు మేత మేసే స్థలం మొత్తంగా ముంపునకు గురైంది. పశువుల మేతకు కష్టంగా ఉంది. వాటిని నిలిపేందుకు కూడా స్థలం లేదు.
    – ఇటవేణి ఓదెలు, కోటిలింగాల 
    తాత్కాలిక ఏర్పాట్లు సరిగ్గా లేవు
    – గంధం రవి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ఉండెడ
    ఉండెడలో ప్రస్తుతం 15 కుటుంబాల ఇళ్లు ముంపునకు గురవుతున్నాయి. వీరి కోసం పునరావాసకాలనీలో సరైన ఏర్పాట్లు చేయలేదు. అసౌకర్యాలలో ఉండడం కట్టమే. 
    తరలించేందుకు సిద్ధంగా ఉన్నాం
    గోదావరిలో వరద మరింత పెరిగితే ముప్పు పొంచిఉన్న కుటంబాలను తరలించేందుకు సిద్ధంగా ఉన్నాం. వీరి కోసం ఆయా గ్రామాల్లో తాత్కాలిక వసతులు ఏర్పాటు చేశాము. 
    – కృష్ణవేణి, తహసీల్దార్‌  
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement