ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
రాజమండ్రి: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 10.8 అడుగులకు చేరింది. దీంతో 2 లక్షల 63 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి అధికారులు విడుదల చేశారు. అలాగే డెల్టాకు 4,500 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.