రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి
Published Wed, Nov 16 2016 10:43 PM | Last Updated on Fri, Mar 29 2019 5:32 PM
జి.మామిడాడ (పెదపూడి) :
రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని బీజేపీ రాష్ట్ర కిసా¯ŒS మోర్చ అ««ద్యక్షుడు పి.తిరుపతిరావు తెలిపారు. జి.మామిడాడలో బుధవారం పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రవేశపెట్టిన పథకాల సద్వినియోగానికి కృషి చేయాలన్నారు. ఈ నెల 26న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించే రైతు మహాసభ కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సభకు బీజేపీ జాతీయ అ««దl్యక్షుడు అమిత్‌షా హాజరవుతారన్నారు. పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మేడపాటి హరినారాయణరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోటకూర వెంకటేశ్వరరావు, మండల శాఖ అధ్యక్షుడు టీవీ కృష్ణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మురముళ్ల వెంకటరమణ, ట్రేజరర్ దేవగుప్తాపు జగ¯ŒS మండల గౌరవ అధ్యక్షుడు మిక్కిలి మహేష్, నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement