
తాళిబొట్టు తాకట్టు
• రెండేళ్లుగా చేతికిరాని పంటలు
• అందని రుణమాఫీ పెరుగుతున్న అప్పులభారం
• కుటుంబ పోషణ కూడా కష్టం..
• ఇదీ నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి రైతుల దుస్థితి
వర్షాల్లేక.. పంటలు చేతికిరాక.. అప్పుతీరే దారిలేక..కుటుంబాలు గడవక..చిన్న, సన్నకారు రైతులు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. తాళిబొట్టు తాకట్టు పెట్టి.. పశువులను తెగనమ్మి.. షావుకారులు, వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పు తెచ్చి సాగు చేపట్టి నిండా మునిగారు. ఒక్కో రైతు మూడు, నాలుగు లక్షల రూపాయల అప్పుల భారంతో సతమతమవుతున్నారు. కుటుంబాల పోషణకు పశువుల కాపరులుగానో, ఇతర పనుల్లో కార్మికులుగానో మారుతున్నారు. నేలకొండపల్లి మండలంలోని సుర్దేపల్లి రైతుల దీనావస్థపై ప్రత్యేక కథనం
నేలకొండపల్లి : రెండేళ్లుగా పంటలు చేతికిరాక రైతులు వేదనకు గురవుతున్నారు. వర్షాలు లేకపోవడంతో వరి, చెరకు పంటలు నష్టాన్నే మిగిల్చారుు. పుస్తెలతాడు తాకట్టుపెట్టి పంటలపెపైట్టుబడి పెట్టి అప్పుల పాలవుతున్నారు. నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి గ్రామంలో మొత్తం 850 ఎకరాల సాగు భూమి ఉంది. ఆ భూమిలో దాదాపు 300 మంది సన్న, చిన్నకారు రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. సాగులో చెరకు, వరి, కంది పంటలది అధికభాగం. రెండేళ్ల నుంచి వర్షాలు లేక పంటలు సాగు నిలిచిపోరుుంది. 850 ఎకరాల్లో 150 ఎకరాల వరకు చెరకు, వరి బావుల కింద కొంత మంది రైతులు సాగు చేసుకుంటున్నారు. బావులు లేని రైతుల భూములు బీళ్లుగా మారుతున్నారుు. కుటుంబం గడవడం కూడా కష్టంగా తయారైంది. చేసేది లేక రైతులు అందినకాడికల్లా అప్పులు తెచ్చి కుటుంబ పోషణ సాగిస్తున్నారు. మరోవైపు వ్యవసాయం కోసం చేసిన అప్పులు, వడ్డీలు భారంగా మారారుు.
పంటలు సాగు చేసి.. అప్పుల పాలై..
గ్రామానికి చెందిన గరిడేపల్లి వెంకటేశ్వర్లు సాగు కోసం రాజేశ్వరపురం ఎస్‌బీహెచ్‌లో తన కోడలు సుజాత పుస్తెలతాడు తాకట్టు పెట్టి రూ.90 వేల రుణం పొందారు. పెట్టుబడి సరిపడక సొసైటీ నుంచి రూ.50 వేలను అప్పుగా తీసుకున్నారు. గతేడాది పంటల సాగు చేపట్టగా నష్టాన్ని మిగిల్చారుు. ఈ ఏడాది కూడా వర్షాలు లేకపోవడంతో వరి సాగు చేపట్టలేదు. పెసర, కంది సాగు చేద్దామని నల్లగొండ జిల్లా కిష్టాపురం గ్రామంలో షావుకారు వద్ద ఇటీవల రూ.20 వేలను తీసుకున్నారు. విత్తనాలు జల్లాక చినుకు లేకపోవటంతో పంట చేతికి రాలేదు. చివరకు రూ.2 లక్షలు అప్పులు మిగిలారుు.
రుణం కోసం కోడలు సుజాత మెడలోని పుస్తెలు తాకట్టు పెట్టటమే కాకుండా ఇంట్లో ఉన్న పశువులను అరుునకాడికి తెగనమ్ముకుని తెచ్చిన డబ్బులతో పెట్టుబడి పెడితే అశించిన ప్రయోజనం కలగకపోవటంతో మనో వేదన చెందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మొదటి విడతగా రూ.13 వేలు, రెండో విడతలో రూ.13 వేలు రుణం మాఫీ చేసింది. మూడో విడత నేటీ వరకు అందించలేదు. చివరకు పశువులను మేపుకుంటూ పశువుల కాపరిగా మారారు. గ్రామంలోని దాదాపు మరో 50 మంది రైతులది ఇదే పరిస్థితి.
ఎటు చూసినా బీడు భూములే...
సుర్ధేపల్లి గ్రామం చుట్టూ చెరువులే. ఒక పక్క పాలేరు పాత కాలువ జలజల పారుతుంటే చెరకు, వరి పంటలు పచ్చగా పంటలతో సస్యశ్యామలంగా ఉండే ఈ గ్రామంలో ప్రస్తుతం పొలాలు బీళ్లుగా మారుతున్నారుు. అరకొరగా సాగుచేసిన పంటలు కరెంట్ కోతలతో ఎండిపోతున్నారుు. పంటలు సాగు కాక, ప్రకృతి కరుణించక, తెచ్చిన అప్పులు తీర్చేదారిలేక తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1071 హెల్ప్‌లైన్ కు పలు మార్లు విన్నవించుకున్నారు. అరుున ఫలితం లేదు. గ్రామం నుంచి రైతులు రాజేశ్వరపురం ఎస్‌బీహెచ్, రామచంద్రాపురం సొసైటీలో దాదాపు రూ.4.50 కోట్లు వరకు అప్పు తీసుకున్నారు. సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ వ్యాపారి నుంచి రూ.10 లక్షల వరకు అప్పు తీసుకున్నారు. పంటల్లేక ఆ అప్పు ఎలా తీర్చాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.