
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
తాడేపల్లి(గుంటూరు జిల్లా): తాడేపల్లి మండలం కుంచనపల్లి సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు..కుంచనపల్లి వద్ద శుక్రవారం వేకువజామున ప్రమాదవశాత్తూ లారీ, ఆటో ఆటో ఢీకొన్నాయి. ఈ రోడ్డుప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో ఒకరు, చికిత్సపొందుతూ మరొకరు మృతిచెందారు.
గాయపడిన వారు విజయవాడ ప్రభుత్వాసుపత్రి, ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు.. ఈ ప్రమాద సమాచారం అందుకొని ఘటనా స్థలానికి వెళ్తున్న పోలీసు వాహనాన్ని మరో జీపు ఢీకొంది. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.