
ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు నాటిస్తున్నాం
♦ హరితహారంలో అందరూ పాల్గొనాలి
♦ లక్ష్యానికి మించి మొక్కలు నాటేందుకు చొరవ చూపాలి
♦ జారుుంట్ కలెక్టర్ -2 ఆమ్రపాలి
కీసర: హరితహారం పథకంలో భా గంగా ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలను నాటిస్తున్నామని జేసీ-2 ఆమ్రపాలి తెలిపారు. శుక్రవారం కీసర తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ వెంకట ఉపేందర్‌రెడ్డి, ఎంపీడీఓ వినయ్‌కుమార్, ఎంపీపీ సుజాత, సర్పంచ్ గణేష్‌లతో కలిసి ఆమె మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పచ్చదనంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని.. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు. చెట్లు సమృద్ధిగా ఉంటేనే వర్షాలు విస్తారంగా కురుస్తాయని.. దీనివల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు.
గ్రామాల్లో నిర్దేశించిన లక్ష్యానికి మించి మొక్కలు నాటేలా అధికారులు, ప్రజాప్రతిని దులు చొరవ చూపాలన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ, అసైన్‌డ స్థలాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయా లు, కాలనీలు, రహదారుల వెంట మొక్కలు నాటించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు కీసర మండలంలోని గ్రామాల్లో ఇప్పటివరకు నాటిన మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొక్కలను సమీపంలోని యాద్గార్‌పల్లి, కీసర నర్సరీల నుంచి తీసుకురావాలని జేసీ ఎంపీడీఓ వినయ్‌కుమార్‌కు సూచించారు.
అరుుతే గ్రామాల్లో ప్రజలు మామిడి, తదితర పండ్ల మొక్కలను అడుగుతున్నారని కీసర, యాద్గార్‌పల్లి నర్సరీలో ఈ పండ్ల మొక్కలు అందుబాటులో లేవని ఎంపీపీ సుజాత జేసీ దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో పండ్ల మొక్కలను పక్క నర్సరీల నుంచి వెంటనే పండ్ల మొక్కలను తెప్పిస్తామని.. ప్రతి ఇంటికి 4నుంచి 5 చొప్పున పండ్ల మొక్కలను సరఫరా చేయాలని ఆమె అధికారులకు సూచిం చారు. మొక్కలు నాటడంతోనే సరిపెట్టుకోకుండా వాటి పరిరక్షణ బాధ్యత కూడా అధికారులదేనన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి మొక్కలకు పోసేలా ఏర్పాట్లు చేయాలని జేసీ అధికారులకు ఆదేశించారు. అనంతరం కీసర, యాద్గార్‌పల్లిలోని నర్సరీలను ఆమె పరిశీలించారు.