సీపెట్‌లో ఉచిత శిక్షణ
Published Tue, Oct 4 2016 8:09 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
ఏలూరు సిటీ :
కేంద్ర పెట్రో రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్)లో ఉచిత శిక్షణతో కూడిన ఉద్యోగ కల్పనకు అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఆర్.రవికుమార్ మంగళవారం తెలిపారు. పదవతరగతి పాస్, ఫెయిల్, ఐటీఐ చదివి 18సంవత్సరాలు పైబడిన అభ్యర్థులు తమ సర్టిఫికెట్ల నకళ్ళతో ఈనెల5న ఏలూరులోని ఉపాధి కార్యాలయంలో హాజరుకావాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తామని, శిక్షణానంతరం రూ.3వేలు ఉపకార వేతనం అందిస్తామన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు కాపు కార్పొరేషన్ ద్వారా ఉచిత శిక్షణ అందిస్తారని తెలిపారు. వివరాలకు 95811 93413లో సంప్రదించాలని కోరారు.
– పరిశ్రమలో ఉద్యోగాలకు :
స్థానికంగా ప్రముఖ పరిశ్రమలో రోజువారీ, నెలవారీ వేతనంపై బదిలీ, పూర్తికాల నియామక పద్దతిలో శిక్షణతో కూడిన ఉద్యోగాలకు ఈనెల 5న ఏలూరులోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రవికుమార్ తెలిపారు. ఎటువంటి విద్యార్హత లేనివారు, ఐటీఐ శిక్షణ పొందిన అభ్యర్థులకు నెలకు రూ.11వేల పైబడి వేతనంతో కూడిన శిక్షణ ఇస్తారని తెలిపారు. శిక్షణ అనంతరం ఉద్యోగ నియామకాలకు అర్హత పొందుతారని తెలిపారు. 19సంవత్సరాలు నిండిన స్త్రీ, పురుష అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని తెలిపారు. వివరాలకు 90329 51173, 99899 44257లో సంప్రదించాలన్నారు.
Advertisement