వివిధ ఉద్యోగాలకు శిక్షణ
Published Mon, Oct 3 2016 10:09 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
ఏలూరు (మెట్రో) : స్థానికంగా పేరొందిన పరిశ్రమల్లో పూర్తికాలపు నియామక పద్ధతిలో ఎటువంటి విద్యార్హత లేని వారికి రెండు సంవత్సరాల శిక్షణ అందించేందుకు ఎంపికలు నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి ఆర్.రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ కాలంలో నెల రోజులకు రూ. 11 వేలు చెల్లిస్తారని, శిక్షణానంతరం శాశ్వత ప్రాతిపదికన నియామకాలకు అర్హులని తెలిపారు. అభ్యర్థులు 167 సెం.మీ ఎత్తు, 19 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేడు, రేపు ఏలూరులోని జిల్లా ప్రభుత్వ ఉపాధికల్పనా కార్యాలయంలో మౌఖిక పరీక్షలకు హాజరు కావాలని రవికుమార్ పేర్కొన్నారు. ఇతర వివరాలకు 9032951173, 9890491308, 9989944257 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
సీపెట్‌లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన పెట్రో రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సౌజన్యంతో ఉన్న సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్)లో నాలుగు నెలల ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఆర్.రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పదోతరగతి పాస్, ఫెయిల్, ఐటీఐ విద్యార్హతలతో 18 సంవత్సరాలు పైబడిన వారు అర్హులని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు నేరుగా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో నేడు, రేపు హాజరు కావాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత భోజన వసతి, వెనుకబడిన తరగతుల వారికి శిక్షణాంతరం రూ. 3 వేలు, కాపులకు కాపు కార్పొరేషన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఇతర వివరాలకు 9581193413, 9490285277 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.
Advertisement
Advertisement