నేడు స్నేహితుల దినోత్సవం | friend ship day special story | Sakshi

నేడు స్నేహితుల దినోత్సవం

Aug 7 2016 4:12 AM | Updated on Sep 4 2018 5:21 PM

నేడు స్నేహితుల దినోత్సవం - Sakshi

నేడు స్నేహితుల దినోత్సవం

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నింపుటకు నేనున్నాని

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
నీ కోసమే  కన్నీరు నింపుటకు
నేనున్నాని నిండుగ పలికే
తోడొకరుండిన అదే భాగ్యమూ.....

సాక్షి, సిటీబ్యూరో: స్నేహానికి ఇంతకంటే గొప్ప నిర్వచనం ఇంకేముంటుంది. జీవితం చుట్టూ ఒక గాడాంధకారం అలుముకున్నప్పుడు, నిరాశా నిస్పృహలు చుట్టుముట్టినపుడు..నీ కోసం నేనున్నాను సుమా..అంటూ భుజం తట్టే ఆత్మీయమైన స్పర్శ స్నేహం. ఆనందాన్ని  రెట్టింపు చేస్తుంది. విషాదాన్ని సగానికి సగం తగ్గిస్తుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోయి, మనిషన్నవాడు మాయమైపోతున్న తరుణంలో ఇంకా ఎక్కడో ఒక చోట ఆత్మీయమైన స్నేహాలు, ఉన్నతమైన మానవతా విలువలు  వెలుగు రేఖలుగా దారి చూపుతూనే ఉంటాయి. స్నేహమంటే ఒక నులివెచ్చటి స్పర్శ.

భాషకందని కమ్మటి భావన. చుట్టూ అల్లుకున్న మానవ సంబంధాల పొదరింట్లో విరిసిన అందమైన గులాబీ. జీవితంలో మరిచిపోలేని ఒక మధుర జ్ఞాపకం. ఎప్పుడో చిన్నప్పుడు...బుడి బుడి అడుగుల బాల్యంలోనే అల్లుకునే స్నేహ బంధాలు కొన్నయితే...పరవళ్లు తొక్కే యవ్వనంలో పెనవేసుకునే అనుబంధాలు మరి కొన్ని. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఏ కాలేజీలోనో, లైబ్రరీలోనో, కలిసి నడిచే కారిడార్‌లోనో,  తరగతి గదిలోని ఒకే బెంచిపై, మాస్టారు బోధించే పాఠాల్లోని సందేహాల్లో ఊపిరి పోసుకొనే స్నేహం..

ఒక మహావృక్షంలా ఎదుగుతుంది. జీవితంతో మమేకమవుతుంది. ఒక విడదీయరాని అనుబంధమైపోతుంది. అసలు కళాశాల అంటేనే స్నేహితుల కలల కాణిచి. సహ విద్యార్థిగా రూపుదిద్దుకొనే పరిచయం..స్నేహమై ఎలా ఎదుగుతుందో, జీవితంలో ఒక తీపి గుర్తుగా ఎలా మిగిలిపోతుందో ఏ డైరీని అడిగినా చెబుతాయి. మదిలో నిక్షిప్తమైన భావాలను, అనుభవాలను, అనుభూతులను పంచుకోవడం తప్ప ఏ స్వార్ధం లేని జీవన బంధం స్నేహం. జీవితంలో ఎవరున్నా, లేకున్నా మంచి నేస్తం ఒకరు తోడుంటే చాలునని కోరుకోని వాళ్లు ఉంటారా. నేడు స్నేహితుల దినోత్సవం. హ్యాపీ ఫ్రెండ్షిప్‌ డే...
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement