రోజూ పాలు.. | gift milk started in zp high school | Sakshi

రోజూ పాలు..

Published Sat, Feb 27 2016 1:55 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

రోజూ పాలు.. - Sakshi

రోజూ పాలు..

శామీర్‌పేట మండ లం లక్ష్మాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ‘గిఫ్ట్‌మిల్క్’ ప్రారంభం
పాల్గొన్న ఎన్‌డీడీబీ చైర్మన్ నందకుమార్, కలెక్టర్ రఘునందన్
‘గిఫ్ట్‌మిల్క్’ ప్రారంభ కార్యక్రమంలో ఎన్‌డీడీబీ చైర్మన్
విద్యార్థులపాలిట వరం : కలెక్టర్
లక్ష్మాపూర్ విద్యార్థులు అదృష్టవంతులు : ఐఐఎల్ ఎండీ

 శామీర్‌పేట్ : పౌష్టికాహార లోపంతో బాధపడే విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని (ఏగ్రేడ్) అందజేయడమే తమ సంస్థ లక్ష్యమని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) చైర్మన్ టీ నందకుమార్ అన్నారు. మండలంలోని లక్ష్మాపూర్  జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎన్‌డీడీబీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గిఫ్ట్‌మిల్క్’ కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టర్ రఘునందనరావుతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నందకుమార్ మాట్లాడుతూ విదేశాల్లో పర్యటించినప్పుడు అక్కడి వారితో పోల్చినట్లు అయితే మన విద్యార్థుల్లో పౌష్టికాహార లోపాన్ని గుర్తిం చినట్లు తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తమ సంస్థ ద్వారా ‘టెట్రాప్యాక్’ ద్వారా విద్యార్థులకు పాలను అందజేస్తున్నట్లు వివరించారు.

కలెక్టర్ రఘునందనరావు మాట్లాడుతూ దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఇక్కడి పాఠశాలలో విద్యార్థులకు పాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు వివరించారు. గిఫ్ట్‌మిల్క్ విద్యార్థుల పాలిట వరమన్నారు. కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన ఎన్‌డీడీబీ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభు త్వ పాఠశాలలకు అన్ని రకాల వసతులు కల్పిస్తోందన్నారు. ప్రతిరోజూ విద్యార్థులకు పాలు అందించే కార్యక్రమం చాలా ఖర్చుతో కూడుకున్నదని, దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

 ఐఐఎల్ మేనేజింగ్ డెరైక్టర్ కేవీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతేడాది లక్ష్మాపూర్  ఉన్నత పాఠశాలను దత్తత తీసుకుని రూ. 66 లక్షలతో డెస్క్ బెంచ్‌లు, పాఠశాల టాయిలెట్లు, ఫ్యాన్ లు, లైట్లు, ఫర్నీచర్, వాటర్ శుద్ధి యం త్రం, యూనిఫాం, బ్యాగులు, టైబెల్టు షూష్, నోట్‌పుస్తకాలు, డైనింగ్ హాల్, గుడ్డు, అరటిపండ్లు తదితర కార్యక్రమా లు నిర్వహిస్తూ వస్తున్నట్లు తె లిపారు. తాజాగా గిఫ్ట్‌మిల్క్ కార్యక్రమం ద్వారా ప్రతి రోజూ విద్యార్థులకు ఒక గ్లాసు పాలు అందించే బృహత్తర కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కటికెల శ్యామల మాట్లాడుతూ మా గ్రామంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం మా గ్రామ విద్యార్థులు చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో ఇండియన్ ఇమ్యూనాలాజికల్ లిమిటెడ్ (ఐఐఎల్) డీఎండీ అనంతకుమార్, డీ ఈఓ రమేష్, ఎంఈఓ వసంతకుమారి, ఎంపీపీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బీ చంద్రశేఖర్‌యాదవ్, జెడ్పీటీసీ బాలేష్, ఎంపీడీఓ శోభారాణి, తహశీల్దార్ దేవుజా, ఈఓపీఆర్డీ లక్ష్మారెడ్డి, ఏపీఎం సురేశ్‌రెడ్డి, ఎంపీటీసీ సక్రి లక్ష్మణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ ప్రభాకర్‌చారి, ఎస్‌ఎంసీ చైర్మన్ రమేష్, సిబ్బంది శంకర్‌రావు, వార్డుసభ్యులు, గ్రామస్తు లు, విద్యార్థులకు ఉపాధ్యాయుల బృందం, పూర్వవిద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement