Nutritional deficiencies
-
ఎస్సీ, ఎస్టీల్లోనే పౌష్టికాహారలోపం అధికం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల్లోనే పౌష్టికాహారలోపం అధికంగా ఉందని తాజాగా ఓ పరిశోధనలో వెల్లడైంది. ‘డైట్ అండ్ న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ ఇన్ ఇండియా’అనే అంశంపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) ఇటీవల పరిశోధన జరిపింది. కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం, కొచ్చి, కర్ణాటకలోని మైసూర్, బెంగళూరుతోపాటు తెలంగాణలోని హైదరాబాద్ సహా మొత్తం 16 రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో నిర్వహించిన ఈ పరిశోధనలో అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీల్లోనే పౌష్టికాహార లోపం అధికమని తేలింది. ఆహార వినియోగం, హెచ్చుతగ్గుల వల్ల సంక్రమించే వ్యాధులు, శరీరంలో ఏర్పడే మార్పులను ఈ పరిశోధనలో కనుగొన్నారు. షెడ్యూల్డ్ కులాల బాలురలో 32.4, బాలికలు 25.2 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని స్పష్టమైంది. ఆదివాసీ బాలురలో 32.6 శాతం, బాలికల్లో 31.7 శాతం, వెనుకబడిన కులాల్లోని బాలురలో 25.8 శాతం, బాలికల్లో 25.8 శాతం మంది పౌష్టికాహారలోపంతో ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. తండ్రి నిరక్షరాస్యుడై తక్కువ తలసరి ఆదాయం కలిగి ఉన్న కుటుంబాల్లో ఈ పరిణామం తీవ్రంగా ఉన్నట్టు వెల్లడైంది. అయితే, దీనికి పేదరికంతోపాటు, నిరక్షరాస్యత, అవగాహనాలోపం, వివక్షలే కారణమని పౌష్టికాహార నిపుణులు, వైద్యులు అభిప్రాయపడుతున్నారు. నిజాయితీగా అమలు చేయాలి పేదరికం, ఆకలి, అవమానాలతోపాటు పిల్లల ఆరోగ్యంపై అసమానతలు బలమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. దాని నివారణకు మధ్యాహ్నం భోజనం లాంటి పథకాలను నిజాయితీగా అమలు చేయాలి. – డాక్టర్ కనకరాజు, వైద్యులు అసమానతలే కారణం దేశంలో నెల కొన్న సామాజిక అసమానతలు ప్రజల జీవితాల్లో ప్రతిబింబిస్తున్నాయి. ఆర్థిక విషయాలతోపాటు ఆహారం, ఆరోగ్యాలపై సామాజిక అసమానతలు, వివక్ష తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అందుకు నిదర్శనమే ఎన్ఐఎన్ సర్వే నివేదిక. – ప్రొఫెసర్ రమామేల్కొటే, భారత ఆహార కమిషన్ మాజీ సలహాదారు ఎదుగుదలపై తీవ్రభావం ఆర్థిక అసమానతలైనా, సామాజిక వివక్షలైనా, బాలలు, మహిళల పైనే ఎక్కువ ప్రభాన్ని చూపుతాయి. ఎన్ఐఎన్ నివేదిక దానికి నిదర్శనం. ఎస్సీ, ఎస్టీల్లో నెలకొని ఉన్న పేదరికం ఆ వర్గాల పిల్లల పెరుగుదలపై, మానసిక వికాసంపై దుష్ప్రభావాన్ని కలిగిస్తోందనడానికి ఇదొక్క ఉదాహరణ చాలు. –లలిత, స్త్రీవాద రచయిత్రి, సామాజిక కార్యకర్త -
సూపర్ వరి
- పౌష్టికాహార లోపానికి ధాన్ 45తో చెక్ - జింక్ అధికంగా ఉండే వరి వంగడం సృష్టి - మన శాస్త్రవేత్తల ఘనత - ఏపీతో సహా ఐదు రాష్ట్రాలకు సిఫార్సు సాక్షి, హైదారాబాద్: భారతదేశంలోని ప్రజల్లో పౌష్టికాహార లోపానికి చెక్ పెట్టేందుకు మన శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన వరి వంగడాన్ని సృష్టించారు. జింక్ ఎక్కువగా ఉండే ఈ కొత్త వంగడానికి ధాన్ 45 అనే పేరు పెట్టారు. ప్రజలు ఎక్కువగా తీసుకునే ఆహారం ద్వారానే పోషకాహార లోపాలను నివారించే లక్ష్యంతో ఈ వరిని అభివృద్ధి చేశారు. దేశంలో పౌష్టికాహార లోపంతో బాధపడే ప్రజలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఐదేళ్లలోపు పిల్లల్లో దాదాపు 70 శాతం మంది పోషకాహారం లేక వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారని పార్లమెంటరీ స్థాయి సంఘం గతంలో ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని నివారించేందుకు పలు సూచనలు కూడా చేసింది. ఇందులో ప్రధానమైంది పౌష్టికాహార లోపాన్ని అధిగమించే వంగడాలను కనిపెట్టడం. పార్లమెంటరీ కమిటీ సూచన మేరకు భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (గతంలో వరి పరిశోధన సంస్థ) కొంతకాలంగా వివిధ రకాల ప్రయోగాలు చేసి కొన్ని వంగడాలను తెరపైకి తీసుకువచ్చింది. ధాన్ 45తో ఏంటి లాభం? పౌష్టికాహార లోపంతో భారతదేశంలో నిత్యం 3 వేల మంది మరణిస్తున్నారు. సుమారు 20 కోట్ల మంది పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారు. వీరిలో అత్యధికులు బాలలు, మహిళలే. భారత్‌లో ప్రధానంగా బీహార్‌లో 50 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 37 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 36, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో 32 శాతం చొప్పున బాలలు పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు. ఎదిగే పిల్లల్లో జింక్ ధాతు లోపం ఏర్పడితే ఎదుగుదలకు ఇబ్బందులు వస్తాయి, రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. మన శరీరంలోని దాదాపు 300లకు పైగా ఎంజైమ్స్ సక్రమంగా పనిచేయాలంటే జింక్ అవసరం. 60, 70 కిలోల బరువున్న వారికి కనీసం రెండు మూడు గ్రాముల జింక్ కావాలి. జొన్న, సజ్జ, రాగి, కొర్ర, వరిగ వంటి చిరు ధాన్యాల వంటి వాటితో శరీరానికి కావాల్సిన పోషకాలను పొందవచ్చు. అయితే ప్రపంచీకరణ నేపథ్యంలో వీటి వినియోగం తగ్గిపోయింది. అందువల్లే పోషకాల్లో ముఖ్యమైన జింక్ అధికంగా ఉండే వరిని వ్యవసాయ పరిశోధన సంస్థ సృష్టించింది. దీనికోసం 12 ఏళ్లు నిర్విరామ కృషి చేసింది. కొత్త వంగడానికి డీఆర్ఆర్ ధాన్ 45 (ఐఇటీ 23832) అని నామకరణం చేసింది. 125 రోజుల్లో కోతకు వచ్చే ఈ కొత్త వరిలో అత్యధికంగా 22.6 పీపీఎం (ఇప్పటి వరకూ ఉన్న వరి వంగడాల్లో ఇదే ఎక్కువ) జింక్ ఉంటుంది. అంతేగాక ఎకరానికి ఐదు టన్నుల వరకు దిగుబడి కూడా ఇస్తుంది. రుచికరంగానూ ఉంటుంది. వరి పరిశోధన సంస్థ సాగుకు సిఫార్సు చేసిన ఐదు రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. ఈ వంగడంతో పౌష్టికాహార లోపాన్ని అధిగమించవచ్చు అని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. తిన్నా.. ‘తీరని ఆకలి’ బియ్యాన్ని పాలిష్ పట్టడం వల్ల గింజపై ఉండే పల్చటి పొర(అల్యూరోన్ లేయర్) పోతుంది. వాస్తవానికిదే ఈ పొరలోనే కొన్ని రకాల విటమిన్లు, ఐరన్, జింక్ తదితర పోషకాలు ఉంటాయి. ఈ సూక్ష్మపోషకాలు లేని బియ్యాన్ని వండుకుని తిన్నా.. కడుపు నిండుతుంది తప్ప శరీరంలో నిజమైన ‘ఆకలి తీరదు’. శాస్త్రీయ పరిభాషలో దీన్ని ‘హిడెన్ హంగర్’ అంటారు. ఈ తీరని ఆకలితో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ముగ్గురి బాలల్లో ఒకరు సతమతమవుతున్నారు. ఫలితంగా వారి శరీర ఎదుగుదల ఆగిపోతోంది. ఈ సమస్యకు ధాన్ 45 పరిష్కారంగా భావిస్తున్నారు. -
జుట్టుకు గట్టి పోషణ
బ్యూటిప్స్ దుమ్ము, ధూళి పోషకాహార లోపాలు శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా వెంట్రుకల కుదుళ్లు బలహీనంగా మారి జుట్టు రాలడం, చండ్రు ఏర్పడటం, వెంట్రుకలు నిర్జీవంగా కనిపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటికి పరిష్కారంగా..! తలలో చుండ్రు సమస్య ఉంటే విరుగుడుగా ఆలివ్ ఆయిల్ ప్యాక్ వేసుకోవాలి. ఇందుకు టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, నాలుగైదు చుక్కల నిమ్మరసం, టీ స్పూన్ నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, మృదువుగా మర్దనా చేయాలి. 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి 2-3 సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గుతుంది. వెంట్రుకలకు సరైన మాయిశ్చరైజర్ అందకపోతేనే పొడిబారడం, జీవం లేనట్టుగా ఉండటం, చిట్లడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వేళ్లకు కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను అద్దుకుంటూ వెంట్రుకలకు నూనె పట్టించాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 రోజులు చేస్తూ ఉంటే వెంట్రుకలు మృదుత్వాన్ని కోల్పోవు. చిట్లడం వంటి సమస్యలు తలెత్తవు. వెంట్రుకలు రాలడం వంటి సమస్యలను నివారించడమే కాదు, వాటి పెరుగుదలకూ దోహదం చేస్తుంది ఆలివ్ ఆయిల్. వెంట్రుక కుదురు బలంగా అవాలంటే దానికి తగిన పోషకాలు అందాలి. ఈ సుగుణాలు ఆలివ్ ఆయిల్లో ఉండటం వల్ల వారానికి ఒక్కసారైనా ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించాలి. దీని వల్ల వెంట్రుకల పెరుగుదల బాగుంటుంది. రాలడం సమస్య దరిచేరదు. ఆలివ్ ఆయిల్-కొబ్బరినూనె సమపాళ్లలో కలిపి వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ జాగ్రత్త వల్ల వెంట్రుకల మృదుత్వం దెబ్బతినదు. రాలడం వంటి సమస్య ఉత్పన్నం కాదు. ఆలివ్ ఆయిల్‌ను పెట్టిన తర్వాత వేడి నీళ్లలో ముంచి, పిండిన టవల్‌ను (టర్కీటవల్) తలకు చుట్టాలి. దీని ద్వారా వెంట్రుక కుదుళ్లలో ఉన్న మురికి, మృతకణాలు తొలగిపోయి, రక్తప్రసరణ మెరుగై వెంట్రుకలు రాలడం అనే సమస్య దరిచేరదు. -
రోజూ పాలు..
శామీర్‌పేట మండ లం లక్ష్మాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ‘గిఫ్ట్‌మిల్క్’ ప్రారంభం ♦ పాల్గొన్న ఎన్డీడీబీ చైర్మన్ నందకుమార్, కలెక్టర్ రఘునందన్ ♦ ‘గిఫ్ట్‌మిల్క్’ ప్రారంభ కార్యక్రమంలో ఎన్డీడీబీ చైర్మన్ ♦ విద్యార్థులపాలిట వరం : కలెక్టర్ ♦ లక్ష్మాపూర్ విద్యార్థులు అదృష్టవంతులు : ఐఐఎల్ ఎండీ శామీర్‌పేట్ : పౌష్టికాహార లోపంతో బాధపడే విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని (ఏగ్రేడ్) అందజేయడమే తమ సంస్థ లక్ష్యమని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) చైర్మన్ టీ నందకుమార్ అన్నారు. మండలంలోని లక్ష్మాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎన్డీడీబీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గిఫ్ట్‌మిల్క్’ కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టర్ రఘునందనరావుతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నందకుమార్ మాట్లాడుతూ విదేశాల్లో పర్యటించినప్పుడు అక్కడి వారితో పోల్చినట్లు అయితే మన విద్యార్థుల్లో పౌష్టికాహార లోపాన్ని గుర్తిం చినట్లు తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తమ సంస్థ ద్వారా ‘టెట్రాప్యాక్’ ద్వారా విద్యార్థులకు పాలను అందజేస్తున్నట్లు వివరించారు. కలెక్టర్ రఘునందనరావు మాట్లాడుతూ దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఇక్కడి పాఠశాలలో విద్యార్థులకు పాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు వివరించారు. గిఫ్ట్‌మిల్క్ విద్యార్థుల పాలిట వరమన్నారు. కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన ఎన్డీడీబీ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభు త్వ పాఠశాలలకు అన్ని రకాల వసతులు కల్పిస్తోందన్నారు. ప్రతిరోజూ విద్యార్థులకు పాలు అందించే కార్యక్రమం చాలా ఖర్చుతో కూడుకున్నదని, దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఐఐఎల్ మేనేజింగ్ డెరైక్టర్ కేవీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతేడాది లక్ష్మాపూర్ ఉన్నత పాఠశాలను దత్తత తీసుకుని రూ. 66 లక్షలతో డెస్క్ బెంచ్‌లు, పాఠశాల టాయిలెట్లు, ఫ్యాన్ లు, లైట్లు, ఫర్నీచర్, వాటర్ శుద్ధి యం త్రం, యూనిఫాం, బ్యాగులు, టైబెల్టు షూష్, నోట్‌పుస్తకాలు, డైనింగ్ హాల్, గుడ్డు, అరటిపండ్లు తదితర కార్యక్రమా లు నిర్వహిస్తూ వస్తున్నట్లు తె లిపారు. తాజాగా గిఫ్ట్‌మిల్క్ కార్యక్రమం ద్వారా ప్రతి రోజూ విద్యార్థులకు ఒక గ్లాసు పాలు అందించే బృహత్తర కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కటికెల శ్యామల మాట్లాడుతూ మా గ్రామంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం మా గ్రామ విద్యార్థులు చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇండియన్ ఇమ్యూనాలాజికల్ లిమిటెడ్ (ఐఐఎల్) డీఎండీ అనంతకుమార్, డీ ఈఓ రమేష్, ఎంఈఓ వసంతకుమారి, ఎంపీపీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బీ చంద్రశేఖర్‌యాదవ్, జెడ్పీటీసీ బాలేష్, ఎంపీడీఓ శోభారాణి, తహశీల్దార్ దేవుజా, ఈఓపీఆర్డీ లక్ష్మారెడ్డి, ఏపీఎం సురేశ్‌రెడ్డి, ఎంపీటీసీ సక్రి లక్ష్మణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ ప్రభాకర్‌చారి, ఎస్ఎంసీ చైర్మన్ రమేష్, సిబ్బంది శంకర్రావు, వార్డుసభ్యులు, గ్రామస్తు లు, విద్యార్థులకు ఉపాధ్యాయుల బృందం, పూర్వవిద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన తండాల్లో ఉచిత భోజనం
సాక్షి, హైదరాబాద్: పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉన్న గిరిజన తండాల్లో ఉచిత భోజన పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలోనే దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలుచేసేందుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఏయే జిల్లాల్లో, ఏయే ప్రాంతాల్లో ఈ ఉచిత భోజన పథకం అవసరముంది, ఎన్ని సెంటర్లలో అమలు చేయాలి, ఈ బాధ్యతను ఎవరికి అప్పగించాలనే వివరాలతో సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 5కే భోజన పథకం విజయవంతంగా అమలవుతోంది. అన్నార్తుల ఆకలి తీర్చేదిగా ప్రశంసలు అందుకుంటున్న ఈ పథకం స్ఫూర్తితో... దుర్భర పరిస్థితులున్న గిరిజన తండాల్లో ఉచిత భోజన పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో శిశు మరణాలు, పౌష్టికాహార లోపంతో వచ్చే వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తోంది. ప్రధానంగా ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మారుమూలన ఉన్న గిరిజన తండాల్లో ఈ దుర్భర పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి తండాలను ఎంపిక చేసుకుని పైలట్ ప్రాజెక్టుగా ఉచిత పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అన్ని వయసుల వారికీ.. ప్రస్తుతం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి పథకం అమల్లో ఉంది. గర్భిణులు, బాలింతలు, 3 నుంచి 6 ఏళ్ల వయసున్న పిల్లలకు ప్రతిరోజు ఒకపూట అన్నం, పప్పు, పాలు, గుడ్డు అందిస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ఈ రెండింటినీ కలిపి.. గిరిజన తండాల్లో అన్ని వయసుల వారికి ఉచిత భోజనం అందించేలా కొత్త పథకాన్ని రూపొందించనున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చవుతుంది, ఎంత మందికి భోజనం వడ్డించాల్సి ఉంటుందన్న వివరాలను అధ్యయనం చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన సోమేష్‌కుమార్ ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 5 భోజన పథకం రూపకల్పనతోపాటు అమలు తీరు తెన్నులపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. దీంతో తండాల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించే ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా ఉచిత భోజన పథకంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. -
రోజూ 16 వేల శిశు మరణాలు!
* ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల బలి * ఈ ఏడాది మరణానికి చేరువలో 59 లక్షల మంది * పౌష్టికాహార లోపం, రోగాలే ప్రధాన కారణం * యూనిసెఫ్ తాజా నివేదిక వెల్లడి హ్యూస్టన్: ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాలు నేటికీ ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు ఐక్యరాజ్య సమితికి చెందిన యునెటైడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్(యూనిసెఫ్) తాజా నివేదికలో పేర్కొంది. ప్రపంచ దేశాల్లో రోజూ 16 వేల మంది ఐదేళ్లలోపు చిన్నారులు మృత్యువాతపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. పౌష్టికాహార లోపం, నివారించదగ్గ రోగాల వల్ల ఈ ఏడాది 59 లక్షల మంది చిన్నారులు ఐదో పుట్టినరోజు జరుపుకునేలోపే మరణానికి చేరువవుతున్నారని హెచ్చరించింది. 1990లో ఏటా 1.27 కోట్లుగా నమోదైన శిశు మరణాల రేటు 2015 నాటికి 50 శాతానికిపైగా తగ్గి 60 లక్షలకన్నా తక్కువకు చేరుకున్నప్పటికీ ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ మరణాల రేటూ ఎక్కువేనని అభిప్రాయపడింది.పౌష్టికాహార లేమి వల్ల 50 శాతం శిశుమరణాలు సంభవిస్తున్నాయని...పుట్టిన 28 రోజుల్లో మరణిస్తున్న శిశువుల సంఖ్య 45 శాతంగా ఉందని వివరించింది. నెలలు నిండక ముందే పుట్టడం, న్యుమోనియా, ప్రసవం సమయంలో సమస్యలు, విరేచనాలు, మలేరియా వంటివి ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలకు ప్రధాన కారణాలని తెలిపింది. ఈ కారణాలకు తోడు శివువులు పుట్టే ప్రాంతమూ శిశు మరణాల రేటులో కీలక పాత్ర పోషిస్తోందని యూనిసెఫ్ నివేదిక వెల్లడించింది. సహారా ఎడారికి దక్షిణాన ఉన్న ఆఫ్రికా దేశాల్లో (సబ్ సహారన్ ఆఫ్రికా) ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు అత్యధికంగా సంభవిస్తున్నట్లు వివరించింది. అక్కడ ప్రతి 12 మంది ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఒకరు మరణిస్తున్నారని...అధిక ఆదాయ దేశాల్లోని శిశు మరణాల రేటు కన్నా ఇది 12 రెట్లు అధికమని యునిసెఫ్ నివే దిక పేర్కొంది. అధిక ఆదాయ దేశాల్లో సగటున ప్రతి 147 మంది ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఒకరు మరణిస్తున్నట్లు వివరించింది. శిశు మరణాలను తగ్గించే చర్యలను వేగవంతం చేయడం ద్వారా 3.80 కోట్ల మంది ఐదేళ్లలోపు చిన్నారులను కాపాడవచ్చని యూనిసెఫ్ తెలిపింది. శిశు మరణాల నివారణకు తీసుకుంటున్న చర్యల కారణంగా 2000 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా 4.8 కోట్ల మంది చిన్నారులు మృత్యుముఖం నుంచి బయటపడ్డట్లు తెలిపింది. 2030 నాటికి ప్రతి వెయ్యి మంది ఐదేళ్లలోపు చిన్నారుల్లో మరణాల రేటును 25 లేదా అంతకన్నా తక్కువకు తగ్గించాలని నూతన లక్ష్యం నిర్దేశించుకుంటున్నట్లు నివేదికలో పేర్కొంది. నవజాత శిశువులకు కేవలం తల్లిపాలు అందించడం, అనారోగ్యానికి గురయ్యే శిశువుల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం తదితర చర్యల ద్వారా ఏటా వేలాది మంది శిశువులను కాపాడవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అసిస్టెంట్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ ఫ్లావియా బుస్ట్రియో తెలిపారు. -
వాక్ ఫర్ కాజ్
పిల్లా.. పెద్దా.. చేతులు కలిపారు. ఆకలి, పౌష్టికాహార లోపంతో చిన్నారులు పడుతున్న ఇబ్బందులపై అవగాహన కల్పించేందుకు అడుగులు కదిపారు. వరల్డ్ విజన్ ఇండియా సోమవారం నిర్వహించిన ఈ ‘24 అవర్ ఫామిన్- వాకథాన్’లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సికింద్రాబాద్‌లోని మహబూబ్ కాలేజీ వద్ద ప్రారంభమైన వాకథాన్ హరిహరకళాభవన్ వద్ద ముగిసింది. బుల్లితెర ఆర్టిస్టులు లోహిత్, షాని, మధు, పవన్‌సాయి, శిరీష, గణేష్, భాస్కర్, సంగీత దర్శకుడు హేమంత్‌కుమార్.. పాఠశాల, కళాశాలల విద్యార్థులు, సాధారణ పౌరులతో కలసి నడిచారు. పౌష్టికాహార లోపం చిన్నారుల్లో ఎలాంటి దుష్ఫలితాలు చూపిస్తుందో తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 24 గంటల ఫామిన్ అంటే... ‘పేదరికంలో మగ్గుతూ, ఆకలితో చనిపోతున్న పిల్లలను గుర్తు చేసుకొంటూ... 24 గంటల పాటు ఉపవాసం ఉండటం. సోమవారం ఉదయం పది గంటల నుంచి మంగళవారం ఉదయం పది గంటల వరకు ఈ వాకథాన్‌లో పాల్గొన్నవారందరూ తిండి ముట్టరు’ అని వరల్డ్ విజన్ ఇండియా ప్రోగ్రామ్ మేనేజర్ తెలిపారు. - సాక్షి, సిటీ ప్లస్ -
వారందరికీ ఇకపై ‘మినీ మెనూ’
వీరఘట్టం, న్యూస్‌లైన్: పౌష్టికాహారలోపంతో బాధపడుతున్న చిన్నారులను అధికారులు గుర్తించారు. చిన్నారుల వయసుకు తగినట్లు ఎత్తు, బరువు లేకపోవడాన్ని గమనించిన అధికారులు అంగన్వాడీ కేంద్రాల్లో అదనపు ఆహారాన్ని ఇచ్చేందుకు మినీ మెనూ అమలు చేయాలని నిర్ణయించారు. ఐపీడీఎస్ కమిషన్ జీఓ విడుదల చేయగా ఆ ఉత్తర్వులను జిల్లాలో ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పంపించారు. పౌష్టికాహార లోపానికి గురైన ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు వయసున్న చిన్నారులకు కొత్త మెనూ ప్రకారం అదనపు ఆహారాన్ని అందజేస్తారు. పౌష్టికాహారానికి సంబంధించిన బియ్యం, పప్పు, కూరగాయలు, నూనె, పోపు దినుసులు, అదనపు నూనె, గుడ్డు, పాలు, అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేయనున్నారు. ఆహారాన్ని అందించే వేళలివే..... పౌష్టికాహార లోపానికి గురైన చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో రోజులో మూడుసార్లు ఆహారాన్ని అందజేస్తారు. ఇంటి వద్ద నాలుగు సార్లు చిన్నారులకు ఆహారాన్ని అందజేయాలి. అంగన్వాడీ కేంద్రాల్లో రోజూ ఉదయం 9.30 గుడ్డు, 11.30గంటలకు వంద మిల్లీలీటర్ల పాలు, మధ్యాహ్నం 12 గంటలకు మినీ భోజనం అందజేస్తారు. పిల్లల తల్లులకు ఇవి తినిపించడమే కాకుండా ఇంటి వద్ద అంగన్వాడీ కేంద్రం నుంచి సరఫరా చేసిన బాలామృతం పౌష్టికాహారం ఉదయం 7.30కు ఒకసారి, సాయంత్రం 5.30కు 50 గ్రాముల చొప్పున జావ వలే చేసి లేదా లడ్డూలా చేసి తినిపించాలి. మధ్యాహ్నం 3.30 గంటలకు ఉడికించిన కూరగాయలు (బంగాళాదుంపలు)గుజ్టులా తయారు చేసి తినిపించాలి. రాత్రి7.30గంటలకు నెయ్యి లేదా నూనెతో తయారు చేసిన భోజనం తినిపించాలి. పిల్లల కోసం సర్వే ... జిల్లాలో 18 అంగన్వాడీ ప్రాజెక్టులున్నాయి. అన్ని ప్రాజెక్టుల పరిధిలో 3,403 అంగన్వాడీ కేంద్రాలు, 789 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారులను గుర్తించేందుకు అంగన్వాడీ కార్యకర్తలు ఇప్పటికే సర్వే నిర్వహించారు. ఈ సర్వే నివేదికను ప్రాజెక్టు అధికారిణులు పీడీ కార్యాలయానికి అందచేసారు. జిల్లాలో వయసుకు సరిపడా ఎత్తు, బరువు లేని చిన్నారులు వేల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. వీరందరికీ అదనపు పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. -
అంగన్వాడీల్లో ‘మినీ’ మెనూ
ఇందూరు, న్యూస్‌లైన్ : పౌష్టికాహార లోపంతో బలహీనంగా మారిన పిల్లలను బలిష్టం చేయడానికి రాష్ట్ర ఐసీడీఎస్ అధికారులు చర్యలు చేపట్టారు. పౌష్టికాహార లోపానికి గురైన పిల్లల బరువును పెంచడమే లక్ష్యంగా జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో కొత్త పౌష్టికాహార మెనూకు శ్రీకారం చుట్టారు. అదే మినీ భోజన మెనూ. ఈ కొత్త మెనూ ద్వారా పౌష్టికాహార లోప పిల్లలందరికీ ప్రతిరోజు గుడ్డు, 100 ఎంఎల్ పాలు అందిస్తారు. వీటితో పాటే బియ్యం, పప్పు, పోపు దినుసులు అందజేస్తారు. ఈ మెనూను జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయాలని ఈ మేరకు ఐసీడీఎస్ కమిషనర్ చిరంజీవి చౌదరి జీఓ ఎంఎస్ నం.15 ద్వారా ఉత్తర్వులను జిల్లా ఐసీడీఎస్ కార్యాలయానికి జారీచేశారు. ఈ క్రమంలో జిల్లా ఐసీడీఎస్ పీడీ రాములు కొత్త మెనూ జీఓ కాపీలను అన్ని ప్రాజెక్టుల సీడీపీఓలకు పంపించారు. 7 నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు ఎవరైనా పౌష్టికాహార లోపానికి గురైతే వారికి కొత్త మెనూ ప్రకారం పౌష్టికాహార భోజనం అందించాలని, ఈ విషయం అంగన్వాడీ కార్యకర్తలకు తెలియజేయాలని ఆదేశాలు జారీచేశారు. పౌష్టికాహారానికి సంబంధించిన సరుకులు బియ్యం, పప్పు, కూరగాయలు, నూనె, పోపు దినుసులు, అదనపు నూనె, గుడ్లు, పాలు అంగన్వాడీ కేంద్రాలకు పంపిస్తున్నారు. ఈనెల నుంచే అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అమలు పర్చాలని పీడీ ఆదేశాలు జారీచేశారు. పిల్లల కోసం సర్వే... జిల్లాలో ఈ పాటికే సుమారుగా రెండు వేల మంది వరకు పిల్లలు పౌష్టికాహార లోపానికి గురైనట్లు అధికారులు గుర్తించారు. వారికి ఆస్పత్రుల్లో చికిత్సలు, అం గన్‌వాడీల్లో పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రస్తుతం వీరికోసం కొత్త మెనూ రావడంతో మరో విడతగా అంగన్వాడీ కార్యకర్తలు సర్వే చేసి పిల్లలను గుర్తించే పనిలో ఉన్నారు. పౌష్టికాహార లోపానికి గురయ్యారో లేదో, పిల్లల ఎత్తుకు తగిన బరును తెలుసుకునేందు కు వారి బరువులను కొలుస్తున్నారు. తక్కువ, అతి తక్కువ బరువు ఉంటే వెంటనే వారి పేర్లను నమోదు చేసుకుంటున్నారు. అలా పేరు నమోదు చేసిన పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లో లేదా పౌష్టికాహారం ఇంటికి పంపించి తినిపిస్తారు. బరువు పెరిగారో లేదోనని వారానికి ఒకసారి వారి బరువు చూస్తారు. పిల్లలకు తినిపించే సమయవేళలు .. పౌష్టికాహార లోపానికి గురైన పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో మూడుసార్లు ఆహారం అందిస్తారు. ఇంటి వద్ద నాలుగు సార్లు తినిపించాలి. ప్రతిరోజు ఉదయం 9:30 గంటలకు గుడ్డు, 11:30కి 100 ఎంఎల్ పాలు, మధ్యాహ్నం 12 గంటలకు మినీ భోజనం అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తారు. తల్లులు, పిల్లలకు ఇది తినిపించడమే కాకుండా ఇంటి వద్ద అంగన్వాడీ కేంద్రం నుంచి అందించిన బాలామృతం పౌష్టికాహా రం ఉదయం 7:30కి ఒకసారి, సాయంత్రం 5:30 మరోసారి 50 గ్రాముల చొప్పున జావలా చేసి లేదా లడ్డులాగా చేసి తినిపించాలి. అంతే కాకుండా మధ్యాహ్నం 3:30లకు ఉడికించిన కూరగాయలు (ఆలుగడ్డ లాంటివి), పండు గుజ్జులా తయారు చేసి తినిపిం చా లి. రాత్రి 7:30లకు భోజనం పెట్టాలి. ఈ భోజనంలో నెయ్యి లేదా నూనె కలపాలి. పౌష్టికాహార లోపానికి కు గురైన పిల్లలకు ప్రతిరోజు ఈ విధంగా ఆహారం అందించడంలో అంగన్వాడీ కార్యకర్త, తల్లి పూర్తి శ్రద్ధ చూపాలి. పక్కాగా అమలు చేస్తాం పౌష్టికాహార లోపానికి గురైన పిల్లల కోసం జిల్లాలో సర్వే నిర్వహిస్తున్నాం. కొత్త మినీ భోజన మెనూ ప్రకా రం సర్వేలో గుర్తించిన పిల్లలకు పౌష్టికాహారం కచ్చితంగా అందిస్తాం. మెనూను పక్కాగా అమలు చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేయరాదని అంగన్వాడీ కార్యకర్తలకు ఆదేశాలు జారీచేశాం. -రాములు, ఐసీడీఎస్, పీడీ -
పౌష్టికాహారలోపం మీ నిర్వాహకమే
ఇందూరు,న్యూస్‌లైన్ : జిల్లాలో ఇటీవల నిర్వహించిన సర్వేల్లో 2,500 మంది పిల్లలు పోషణ లోపానికి గురైయ్యారని తేలిందని, మహిళా,శిశు సంక్షేమ శాఖ ద్వారా మాతా,శిశువులకు సరైన పౌష్టికాహారం అందక పోవడమే దీనికి కారణమని కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, ఐసీడీఎస్ ఉద్యోగులు, సిబ్బంది ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని కలెక్టర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న పౌష్టికాహార అభివృద్ధి పథకం(ఐఎస్‌ఎస్‌ఎన్‌ఐపీ) పై జిల్లాలోని ఐసీడీఎస్ సీడీపీఓల, సూపర్వైజర్లకు జిల్లా పరిషత్‌లో బుధవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అంగన్వాడీ కేంద్రాలల్లో గర్భిణులకు నెలకు ఒకసారి బరువు,ఇతర పరీక్షలు నిర్వహించి... ప్రతిరోజు పౌష్టికాహారం అందించకపోవడం వల్లే అనారోగ్యంతో, తక్కువ బరువుతో పిల్లలు పుడుతున్నారని తెలిపారు. ఇదే పోషణ లోపానికి ప్రధాన కారణమన్నారు. పుట్టిన పిల్లలకు సక్రమంగా పౌష్టికాహారం ఇవ్వకపోవడం కూడా కారణమన్నారు. జనవరి నెలలో పుట్టిన 60 మంది పిల్లలు పౌష్టికాహార లోపం, వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. మాతా,శిశు మరణాలు పూర్తిస్థాయిలో తగ్గడం లేదని, సమస్య ఎక్కడుందో గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.మాతాశిశు సంరక్షణ అన్ని చర్యలు తీసుకోవాలని, పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రతీ అంగన్వాడీ కేంద్రాన్ని మాడల్ అంగన్వాడీ కేంద్రంగా మార్చాలని, తాగునీటి, టాయిలెట్లు, సొంత భవనాలు కచ్చింతగా ఉండాలన్నారు. ఇందుకు 500 కొత్త భవనాలు, టాయిలెట్లు మంజురయ్యాయని, వాటిని వారంలోగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఐసీడీఎస్ ఉద్యోగులపై బాధ్యతలు.. అన్ని శాఖల కంటే ఐసీడీఎస్ శాఖపై చాలా బాధ్యత ఉందని ఐసీడీఎస్ రాష్ట్ర జాయింట్ డెరైక్టర్ సరళ రాజ్యలక్ష్మి అన్నారు. పిల్లలకు, గర్భిణులకు సక్రమంగా పౌష్టికాహారం అందించాలన్నారు. జిల్లాలో 2,500 మంది పిల్లలు పోషణ లోపానికి గురయ్యారంటే, దానికి కారణం పౌష్టికాహారం అందించకపోవడమేనని అన్నారు. వచ్చే తరం పిల్లలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలన్నారు. కాగా ఫ్రీ స్కూల్ పిల్లలు అంగన్వాడీలకు వచ్చే విధంగా, వారి హాజరు శాతాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐఎస్‌ఎస్‌ఎన్‌ఐపీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ రాములు, జెడ్పీ సీఈఓ రాజారాం, డీపీవో సురేశ్‌బాబు, డీఈఓ శ్రీనివాసచారి పాల్గొన్నారు. -
చిక్కిశల్యం!
అనంతపురం టౌన్/అర్బన్/ సిటీ, న్యూస్‌లైన్ : మహిళలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా ఉందనడానికి పై రెండు ఉదంతాలే నిదర్శనం. పేదలకు పౌష్టికాహారం పంపిణీ పేరుతో ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. మాతా, శిశు మరణాలను అరికట్టేందుకు స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ), వైద్య, ఆరోగ్య శాఖలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇదంతా కాగితాలకే పరిమితం. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో నిధులు, పౌష్టికాహారం పక్కదారి పడుతున్నాయి. ఫలితంగా ఏటా వందల సంఖ్యలో మాతా, శిశు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. పౌష్టికాహార లోపం కారణంగా రక్తహీనత బారినపడి ఎక్కువ శాతం మహిళలు ప్రసవం సమయంలో చనిపోతున్నారు. గర్భస్థ శిశువుల్లో ఎదుగుదల కూడా ఉండడం లేదు. దీంతో వారూ మృత్యువాత పడుతున్నారు. నిద్రమత్తులో వైద్య, ఆరోగ్య శాఖ రక్తహీనతతో బాధపడే వారి సంఖ్య ఏటా పెరుగుతున్నా వైద్య, ఆరోగ్య శాఖ మేల్కోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అందులోనూ పేదలే అధిక శాతం ఉండడం గమనార్హం. ఈ సమస్యతో ప్రతి రోజూ పలువురు జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రికి వస్తున్నారు. గ్రామీణ , గిరిజన ప్రాంతాల నుంచే అధిక కేసులు నమోదవుతున్నాయి. ప్రతి రోజూ ఒకటి నుంచి 50 దాకా రక్తహీనత కేసులు నమోదవుతున్నాయి. వీరిలో అధిక శాతం గర్భిణులుండగా.. చిన్నారులు 20 శాతం వరకు ఉన్నారు. ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఐదు లక్షల మంది చిన్నారుల్లో 55 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. వీరి బరువు, ఎత్తును బట్టి ఈ శాతాన్ని గుర్తించారు. అదే రక్తపరీక్ష ద్వారా అయితే మరింత మంది బయటపడే అవకాశం ఉంది. అలాగే 60 శాతం మంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారు. గ ర్భం దాల్చిన మూడో నెల నుంచే ఐరన్ మాత్రలు అందించాలి. అయితే... క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కన్పించడం లేదు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పురుష ఆరోగ్యకర్తలు, హెల్త్ ఎడ్యుకేటర్లు సరిగా పనిచేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రక్తహీనతతో బాధపడే వారిని ముందస్తుగా గుర్తిస్తే వారికి మెరుగైన వైద్యం అందించి ప్రసవం సులువుగా జరిగేలా చూడవచ్చు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంతో పాటు మాతా శిశు మరణాలను అరికట్టవచ్చు. గర్భిణులు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, టీకాలు వేయించుకోకపోవడం వల్ల అభం శుభం తెలియని చిన్నారులు బలైపోవాల్సి వస్తోంది. ఈ ఏడాది కాలంలో రక్తహీనత, బీపీ, శ్వాస సంబంధ వ్యాధులతో 307 మంది గర్భిణులు మరణించారు. ఇందులో 40 శాతం మరణాలు రక్తహీనతతో సంభవించాయని తెలుస్తోంది. చిన్నారుల్లో రక్తహీనతతో బాధపడే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటోంది. వీరికి ప్రభుత్వం ఫై సల్ఫేట్ ఐరన్ ఫోలిక్ మాత్రలు అందజేస్తోంది. జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల మంది విద్యార్థులకు, లక్ష మంది బడిబయట ఉన్నచిన్నారులకు జవహర్ బాల ఆరోగ్య రక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి గురువారం మాత్రలు అందిస్తున్నారు. ఇవి ఒక్కోసారి వికటిస్తుండడంతో మింగడానికి భయపడుతున్నారు. పక్కదారి పడుతున్న పౌష్టికాహారం గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని మురికివాడల్లో నివసిస్తున్న వారిలో రక్తహీనత నివారణ కోసం పౌష్టికాహారం అందించే బాధ్యతను స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) తీసుకున్నాయి. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా జిల్లా వ్యాప్తంగా 4,286 కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రతి రోజూ 39,526 గర్భిణులు, 38,975 మంది బాలింతలు, 2,95,991 మంది చిన్నారులు లబ్ధి పొందుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీరందరికీ రోజూ పౌష్టికాహారంతో పాటు వారంలో రెండురోజులు ఉడికించిన కోడిగుడ్లు ఇవ్వాలి. ఇటీవల కణేకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, హిందూపురం, మడకశిర, కంబదూరు ప్రాజెక్టుల పరిధిలో ఇందిరమ్మ అమృతహస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు. దీని ద్వారా రోజూ మధ్యాహ్న భోజనం అందించాలి. ఒక గ్లాసు పాలు, కోడిగుడ్లు కూడా ఇవ్వాలి. అయితే.. క్షేత్ర స్థాయిలో పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. పౌష్టికాహార లోపం నివారణ కోసం పాతికేళ్లకు పైగా ఐసీడీఎస్ అధికారులు కృషి చేస్తున్నా ఫలితాలు కన్పించకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇకపోతే ఐసీడీఎస్ కేంద్రాల తరహాలోనే మూడేళ్ల నుంచి ఐకేపీ ఆధ్వర్యంలో జిల్లాలోని 24 మండలాల్లో పౌష్టికాహార కేంద్రాలు నిర్వహిస్తున్నారు. లబ్ధిదారుల ద్వారా రోజూ రూ.5 చొప్పున వసూలు చేసి... రెండు పూటల భోజనం అందించడమే ఈ కేంద్రాల ముఖ్యోద్దేశం. ప్రస్తుతం 24 మండలాల్లో 185 కేంద్రాల ద్వారా దాదాపు 500 మంది గర్భిణులు, 500 మంది బాలింతలు, 600 మంది చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రెండు పూటల భోజనంతో పాటు పాలు, పండ్లు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే... ఈ కేంద్రాలు కూడా సమర్థవంతంగా నడవడం లేదు. లబ్ధిదారుల ద్వారా డబ్బు వసూలు చేస్తుండడం(గతంలో రూ.10 ఉండేది)తో అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేకపోతున్నాయి. ఇప్పటికే 20 కేంద్రాలకు పైగా మూతపడినట్లు సమాచారం.