బ్యాంక్ ఖాతా వివరాలు అడిగితే ఫిర్యాదు చేయండి
Published Fri, Oct 14 2016 9:45 PM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM
– ప్రజలకు ఎస్పీ భాస్కర్ భూషణ్ సూచన
ఏలూరు (సెంట్రల్) : గుర్తు తెలియని వ్యక్తులు ఏవరైనా ఫోన్ చేసి బ్యాంకు అధికారులమని చెప్పి బ్యాంక్ ఖాతాల వివరాలు, పిన్ నంబర్, ఏటీఎం కార్డు నంబర్లు చెప్పాలని కోరితే వారి వివరాలను సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఇవ్వాలని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ప్రజలకు సూచించారు. శుక్రవారం ఆయన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోన వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఫోన్ ద్వారా పలు సమస్యలపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బ్యాంకుల వద్ద డబ్బులు డ్రా చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, దీపావళి పండగ సందర్భంగా వ్యాపారులందరూ బాణసంచా లైసెన్స్‌లు కలిగి ఉండాలన్నారు. లైసెన్స్‌లు లేకుండా బాణసంచా తయారు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
– పెంటపాడు నుంచి ఫోన్ చేసిన ఓ మహిళ తనను ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్టు ఫిర్యాదు చేశారు. జంగారెడ్డిగూడెంలో బెల్టు షాపులు నిర్వహణపై చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. 15 మంది వివిధ సమస్యలపై ఫిర్యాదులు చేశారు. వారి సమస్యలను తెలుసుకున్న ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి వాటిపై విచారణ నిర్వహించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు.
Advertisement
Advertisement