జీఓ 271తో వినాశనమే | go 271 is a night mare | Sakshi

జీఓ 271తో వినాశనమే

Published Fri, Aug 5 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

go 271 is a night mare

ఆమదాలవలస: రైతు యాజమాన్య హక్కును హరించే జీఓ నంబర్‌ 271తో రైతు బతుకు నాశనమవుతుందని, ఆ జీఓను రద్దు చేయాలని వైఎస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర హై పవర్‌ కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం డిమాండ్‌ చేశారు. ఆయన శుక్రవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బొడ్డేపల్లి రమేష్‌కుమార్‌లతో పాటు మరికొందరు వైఎస్సార్‌ సీపీ నాయకులతో కలిసి వెళ్లి తహశీల్దారుకు జీవో రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందించారు.  ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ పట్టాదారు పాస్‌పుస్తకాలు రద్దు చేయడం వల్ల రైతులకు ఆధారం పోతుందని అన్నారు. ఒకరి భూములు వేరొకరు క్రయవిక్రయాలు చేసే ప్రమాదం ఉందన్నారు. దీనివల్ల భూ తగాదాలు పెరుగుతాయని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కొత్త సర్వే నిర్వహించి, గ్రామసభలు పెట్టి రైతులకు అన్ని వివరాలు చెప్పి, ఆన్‌లైన్‌ చేసినప్పటికీ మ్యాన్యువల్‌గా కూడా పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్‌ డీడ్‌లకు గుర్తింపు ఉంచే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు తమ్మినేని శ్రీరామమూర్తి, మున్సిపల్‌ వైస్‌ ఫ్లోర్‌ లీడర్‌ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, నాయకులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, సైలాడ దాసునాయుడు, గురుగుబెల్లి చలపతిరావు, బొడ్డేపల్లి జోగారావు, బత్తుల లక్ష్మణరావు(బుజ్జి), పొన్నాడ నాగు, రాకీ, పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement