మావుళ్లమ్మకు స్వర్ణ కంఠాభరణం
Published Tue, Oct 4 2016 1:27 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
భీమవరం టౌన్ : భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మవారికి 95 గ్రాముల స్వర్ణ కంఠాభరణాన్ని కొడమంచిలి కొప్పేశ్వరరావు సోమవారం సమర్పించారని దేవస్థానం ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతులమీదుగా ఆభరణాన్ని అందించారన్నారు. ధర్మకర్తల మండలి చైర్మన్ కార్మూరి సత్యనారాయణమూర్తి, ధర్మకర్తలు అడ్డగర్ల ప్రభాకర గాంధీ, దేవరపల్లి వెంకటేశ్వరరావు, అడ్డాల సత్యనారాయణ, కట్టా వెంకటేశ్వరరావు, కారెంపూడి ఆదిలక్ష్మి పాల్గొన్నారు.
మహా సరస్వతి యాగం
దసరా మహోత్సవాల సందర్భంగా మావుళ్లమ్మ దేవస్థానం లో సోమవారం వేద పండితులతో వేద విద్వత్సభ నిర్వహించారు. రాష్ట్రంలో సాంకేతిక విద్యాభివృద్ధి, బాలబాలికల విద్యాభివృద్ధిని కాంక్షిస్తూ మహా సరస్వతి యాగం, చండీ హోమం, లలితా సహస్రనామ పారాయణ చేశారు. కృష్ణా జిల్లా కూచిపూడికి చెందిన కె.జ్యోతి శిష్యబృందం కూచిపూడి జానపద నృత్య ప్రదర్శనతో అలరించారు.
Advertisement
Advertisement