సేంద్రియ సాగుతో రైతులకు మేలు
అందరి బాగుకు సేంద్రియ సాగు ∙ఏఓ బాబూ నాయక్
సదాశివపేట రూరల్:రైతులు సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు సాధించాలని, దీనివల్ల అటు రైతులకు లాభాలతో పాటు సేంద్రియ ఉత్పత్తుల ను వినియోగించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని సదాశివపేట మండల వ్యవసాయశాఖ అధికారి బాబూనాయక్ తెలిపారు. బుధవారం నిజాంపూర్ గ్రామంలో 50 ఎకరాల్లో సేంద్రియ సాగు చేస్తున్న రైతులకు భూ సంజీవనిపై ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సేం ద్రియ పద్ధతిలో వరినాటే విధానం గురించి రైతులకు వివరించారు. మహిళా రైతులకు సేంద్రియ పద్ధతిలో వరినాటే విధానం గురించి సూచనలు, సలహాలు ఇచ్చారు.
సేం ద్రియ వరి సాగు చేసే ప్రతి రైతు భూ సారాన్ని, భూమి సమతుల్యతను పాటిం చేందుకు తప్పనిసరిగా పచ్చిరొట్ట ఎరువు, జనుము, జీలుగను సాగు చేయాలని సూచిం చారు. సేంద్రియ ఎరువులతో సాగు చేసే రైతులు తమ భూమిలో తప్పకుండా మిష¯ŒS కాకతీయ కింద తవ్వుతున్న చెరువులోని మట్టి వేసుకోవాలన్నారు. వర్మి కంపోస్టు వాడటం వల్ల రైతులకు కలిగే లాభాల గురించి ఆయన రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఏఈఓ శ్రీనివాస్, సేంద్రియ రైతులు సత్యనారాయణ, శ్రీనివాస్, మహిళా రైతులు పాల్గొన్నారు.