- ∙మంచి మార్కులు, గ్రేడ్‌ల సాధనకూ అవకాశం
- ∙విద్యార్థులు ప్రత్యేక దృష్టి పెడితే మేలు
- ∙ పరీక్షల్లో రాసే అక్షరాలు ఒకేలా ఉండాలి.
- ∙ అక్షరాలు మరీ పెద్దవి, చిన్నవిగా ఉండకూడదు.
- ∙ పేపరంతా ఒకే స్థాయిలో అక్షరాలు ఉండాలి. చేతిరాత బాగుంటే జవాబు పత్రాలను దిద్దే ఉపాధ్యాయులు ప్రభావితమవుతారు.
- ∙ గుండ్రంగా, అందంగా రాసే అక్షరాలకు ఆకర్షించి మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది.
- ∙ మనసుకు హత్తుకునేలా అక్షరాలు ఉండాలి. అక్షరాలను గొలుసులా రాస్తే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉండదు.
ముచ్చటైన దస్తూరీ.. మంచి భవితకు రహదారి..
Published Fri, Nov 11 2016 9:33 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
రాయవరం :
బొటనవేలూ, చూపుడువేళ్ల మధ్య నుంచి జాలువారే ముత్యాల ముగ్గులు ముంగిలికి అందాన్నిస్తాయి. చూపుడు వేలూ, నడిమి వేళ్ల నడుమ కలాన్ని బిగించి, బొటనవేలితో అదుముతూ కాగితంపై ‘రంగవల్లుల వరుస’లను సృజించే చేతిరాతా రమణీయమే. కంప్యూటర్ యుగంలో దస్తూరీకి ప్రాధాన్యం తగ్గింది. చేతులకు రాత పని దూరమవుతోంది. అయితే విద్యార్థుల విషయానికి వస్తే..రాత పరీక్షల్లో మార్కులకు సంబంధించి చేతిరాత కీలకమైనది.అందంగా రాసే అక్షరాలకు వచ్చే అదనపు మార్కులూ మంచి ఫలితాలకు దోహదపడతాయి. మరోవైపు చేతిరాతను బట్టి వ్యక్తుల గుణగణాలను అంచనా వేయొచ్చు. పరీక్షల్లో ఫలితాన్ని, భవితను నిర్దేశించేది అందమైన అక్షరాలేనని విషయ నిపుణులు పేర్కొంటున్నారు. చేతిరాతపై దృష్టి సారిస్తే మంచి ర్యాంకులు, గ్రేడ్లు సాధించవచ్చు. వచ్చే పదవ తరగతి ఫలితాల్లో మెరుగైన మార్కులు, గ్రేడులు సాధించాలంటే విద్యార్థులు ఇప్పటి నుంచే చేతిరాతపై దృష్టి సారిస్తే మంచిది.
ఏకాగ్రతతో మంచి దస్తూరీ
పది, ఇంటర్, డిగ్రీ, వృత్తి విద్యా కోర్సుల వార్షిక పరీక్షలు మరికొద్ది నెలల్లో రానున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు చేతిరాతపై ఇప్పటి నుంచే దృష్టి సారించాల్స. విద్యార్థులు ఉత్తమ మార్కులు, గ్రేడులు సాధించడానికి ప్రణాళికలు రూపొందించుకున్నా చేతిరాత గురించి మాత్రం పట్టించుకోరు. దీంతో అనుకున్న మార్కులు పొందలేక పోతుంటారు. ఆత్మవిశ్వాçÜం, ఏకాగ్రతను పెంచుకుంటే మంచి రాత వస్తుంది. ఏడాది పొడుగునా చదివిన పాఠ్యాంశాలపై పరీక్షల్లో వచ్చే ప్రశ్నలకు విద్యార్థి అందంగా రాసే సమాధానాలపైనే ఎన్ని మార్కులు వస్తాయనేది ఆధారపడి ఉంటుంది.
సాధనతో చక్కటి దస్తూరీ
జిల్లావ్యాప్తంగా 534 ఉన్నత పాఠశాలల నుంచి సుమారు 70 వేల మంది విద్యార్థులు వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. ఇంటర్, డిగ్రీ పరీక్షలను మరికొన్ని వేల మంది రాయనున్నారు. పరీక్షల కోసం ఇప్పటి నుంచే పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. ఏడాదంతా చదివిన పరిజ్ఞానాన్ని పేపరుపై పెట్టే సమయం సమీపిస్తోంది. చేతిరాత బాగుంటే విద్యార్థుల్లో ఆత్మ విశ్వాçÜం పెరుగుతుంది. ఆకర్షణతో కూడిన అక్షరాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. పరీక్షల సమయంలో ఇటు సబ్జెక్టులకు సన్నద్దం అవుతూ మరోవైపు రోజులో కొంత సమయం చేతిరాతపై దృష్టి సారిస్తే సబ్జెక్టుపైనే కాక రాతపై పట్టు వస్తుంది. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించాలి.
అందమైన అక్షరాలే ఆకర్షణ..
Advertisement
Advertisement