రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున వరుణయాగాలు, వరుణజపాలు నిర్వహించేందుకు దేవాదాలయ శాఖ సన్నధ్దమైంది.
హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున వరుణయాగాలు, వరుణజపాలు నిర్వహించేందుకు దేవాదాలయ శాఖ సన్నధ్దమైంది. శుక్రవారం దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దీనిపై శాఖ కమిషనర్‌తో చర్చించారు. వీటి నిర్వహణకు సంబంధించి పండితులతో మాట్లాడి పూర్తి వివరాలను తెలపాల్సిందిగా ఆదేశించారు.
అంతుకుముందు తెలంగాణ అర్చక సమాఖ్య ప్రతినిధులు మంత్రితో భేటీ అయి..వర్షాభావం నేపథ్యంలో తాగు, సాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఉన్నందున వరుణయాగాలు, జపాలు నిర్వహిస్తే సానుకూల అవకాశం ఉంటుందని మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రత్యేకంగా కమిషనర్‌ను పిలిపించి ఈ అంశమై పరిశీలన చేయాలని సూచించినట్లుగా చెబుతున్నారు.