'ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నడపాలి'
నిజామాబాద్: నిజాం షుగర్స్ను స్వాధీనం చేసుకొని రైతులకు ప్రభుత్వమే భరోసా కల్పించాలని రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. నిజాం షుగర్స్ను ప్రభుత్వమే నడపాలని, రైతులకు అప్పగించాలనుకోవడం సరికాదని హితవు పలికారు. నిజాం షుగర్స్ మూడు జిల్లాల సదస్సులో కోదండరాం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ప్రభుత్వంపై చెరుకు రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని నమ్మారని చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంలో దృష్టిని సారించాలని, వారి డిమాండ్ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. రైతులు గుండె ధైర్యం కోల్పోవద్దని, వారికి తాము అండగా ఉంటామని చెప్పారు.