ప్రతిపక్ష నేత హెచ్చరికతో దిగి వచ్చిన సర్కార్ | Government came descended with Opposition leader Warning | Sakshi
Sakshi News home page

ప్రతిపక్ష నేత హెచ్చరికతో దిగి వచ్చిన సర్కార్

Published Mon, Dec 5 2016 12:52 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

ప్రతిపక్ష నేత హెచ్చరికతో దిగి వచ్చిన సర్కార్ - Sakshi

ప్రతిపక్ష నేత హెచ్చరికతో దిగి వచ్చిన సర్కార్

పేదలకు అండగా ఉన్న ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చొద్దంటూ సీఎం చంద్రబాబుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన బహిరంగ లేఖ, ధర్నా చేస్తామంటూ చేసిన హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది.

 ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల చెల్లింపునకు అదనంగా రూ.262.35 కోట్లు విడుదల
 
 సాక్షి, అమరావతి/భీమవరం టౌన్:
పేదలకు అండగా ఉన్న ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చొద్దంటూ సీఎం చంద్రబాబుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన బహిరంగ లేఖ, ధర్నా చేస్తామంటూ చేసిన హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల చెల్లింపులకు అదనంగా రూ.262.35 కోట్లు విడుదల చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదివారం ఉత్తర్వులిచ్చారు. జగన్ లేఖ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సెలవు రోజైనా బడ్జెట్ కేటారుుంపులకు అదనంగా రూ.262.35 కోట్లు కేటారుుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిధుల వ్యయానికి త్రైమాసిక, ట్రెజరీ ఆంక్షలను మినహారుుస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మార్చిలో బడ్జెట్ ప్రవేశ పెట్టేనాటికి ఆరోగ్యశ్రీ బకారుులు రూ.395.69 కోట్లు. ఈ ఏడాది అవసరం రూ. 910.77 కోట్లు. అంటే మొత్తం రూ. 1306.46 కోట్లు. కానీ ఈ ఏడాది కేటారుుంచింది రూ.568.23 కోట్లు మాత్రమే. అంటే ఇంకా రూ. 738.23 కోట్లు ఆరోగ్యశ్రీ బకారుులకు అవసరం కాగా ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం హడావిడిగా రూ. 262.35 కోట్లు కేటారుుంచింది. అంటే ఇంకా రూ. 475.88 కోట్లు అవసరమన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement