రాయలసీమలో కరువు పరిస్థితుల నివారణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ గేయానంద్ ఆరోపించారు.
కర్నూలు : రాయలసీమలో కరువు పరిస్థితుల నివారణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ గేయానంద్ ఆరోపించారు. మంగళవారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో గేయానంద్ మాట్లాడుతూ... రాయలసీమ జిల్లాల్లో కరువు విలయతాండవం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయినా ప్రభుత్వం మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రజలందరూ చైతన్యవంతులై కరువుపై పోరాడాలని గేయానంద్ సూచించారు. హంద్రీ - నీవా కాలువ వల్లే రాయలసీమలో తాగు నీటి సమస్య తీరుతుందని ఆయన తెలిపారు.