గురుపూజోత్సవం | guru puja celebration | Sakshi
Sakshi News home page

గురుపూజోత్సవం

Published Mon, Jul 25 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

గురుపూజోత్సవం

గురుపూజోత్సవం

 
రాపూరు : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో ఆదివారం గురుపూజోత్సవం   ఘనంగా నిర్వహించారు. శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణ మండపంలో సరస్వతీదేవి జన్మనక్షత్రం రోజైన ఆదివారం వివిధ ప్రాంతాలకు చెందిన పండితులను, గురువులను దేవస్థాన పాలకవర్గ అధ్యక్షులు నానాజీ, దేవాదాయశాఖ అధికారులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదటిసారిగా గురువులను పూజించి, సన్మానించిన ఘనత పెంచలకోన దేవస్థానానిదేనని తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నారు. అంతకుముందు కోనకు వచ్చిన పండితులు, గురువులు వేదపారాయణం చేశారు. అనంతరం చతుర్వేద పండితులు వంగల రామ్మూర్తి ఘనాపాఠి, మల్లికార్జున అవధాని, సత్యనారాయణాచార్యులు, నారాయణాచార్యులు, సంపత్‌కుమార్, అనంత వేంకట దీక్షితులు, శ్రీనివాసాచార్యులు, విష్ణుభట్ల శ్రీకృష్ణ ఘనాపాఠి, చంద్రశేఖర అవధాని, రామకృష్ణశర్మ అవధాని, చైతన్యశర్మ అవధాని, చంద్రశేఖర అవధాని, అన్నపూర్ణయ్య ఘనాపాఠి, రాజేశ్వరశాస్త్రి, సీతారామయ్య, పెంచలయ్య, కృష్ణమూర్తి అవధాని, కంతేటి త్రినాథ్‌ అవధాని, నరసింహరావులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గూడూరు డీఎస్‌పీ శ్రీనివాస్, దేవాదాయ ధర్మాదాయ అసిస్టెంట్‌ కమిషనర్‌ రవీంద్రారెడ్డి, ఈవో శ్రీరామమూర్తి, పాలకవర్గసభ్యులు సోమయ్య, గోపాల్, హిందూ ధర్మపరిషత్‌ కోఆర్టినేటర్‌ సునీల్, అమరా శ్రీరాములశ్రేష్టి పాల్గొన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement