ఆంధ్రా రీజియన్‌లోని తొమ్మిది జిల్లాలకు విజయవాడలో
అన్ని గ్రూపుల్లో 770 సీట్లు
పామర్రు : ఏపీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి జూన్ 1 నుంచి కొన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆంధ్రా రీజియన్ కౌన్సెలింగ్ కన్వీనర్, నిమ్మకూరు గురుకుల కళాశాల ప్రిన్సిపల్ ఎన్ సీతాపతి మంగళవారం తెలిపారు. నిమ్మకూరు గురుకుల కళాశాలలో ఆయన మాట్లాడుతూ ప్రతిభ, రిజర్వేషన్‌ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారన్నారు. ఆంధ్ర రీజియన్‌లో 5 కాలేజీలు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాలు ఉన్నాయన్నారు.
ఈ జిల్లాల విద్యార్థులను 5 కాలేజీల్లో తీసుకుంటారన్నారు. నాగార్జునన సాగర్‌లో బాలుర, కృష్ణాజిల్లా నిమ్మకూరులో బాల, బాలికలకు, నెల్లూరు జిల్లా వెంకటగిరిలో బాలురు, విజయనగరం జిల్లా వెంకటగిరిలో బాలురు, విజయనగరం జిల్లా తాడిపూడిలో బాలికలు, గుంటూరు మైనార్టీ బాలురకు కళాశాలలు ఉన్నాయన్నారు.
సీట్ల వివరాలు
ఐదు కళాశాల్లోనూ కలిపి ఎంపీసీ గ్రూపులో 278 సీట్లు, బైపీసీలో 201, సీఈసీ 104, ఎంఈసీలో 127 సీట్లు ఉన్నారుు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి సీజీటి, ఈఈటీ కోర్సులకు నిమ్మకూరు కళాశాలలో మాత్రమే 60 సీట్లు ఉన్నారుు.
ఫీజుల వివరాలు
సైన్సు గ్రూపుల నిర్వహణ ఫీజు రూ. వెయ్యి, రూ. 1050 ఎంఈసీ, సీఈసీ గ్రూపులకు నిర్వహణ ఫీజు వెయ్యి, రూ. 637 ఫీజును కౌన్సెలింగ్‌లో సీటు ఖరారైన వెంకటనే చెల్లించాలి.
కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సిన ధ్రువీకరణపత్రాలు
కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు ఒరిజనల్ సర్టిఫికెట్లను అధికారులకు చూపించాలి.పదో తరగతి గాని, తత్సమాన పరీక్ష మార్కుల లిస్టు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్, 4వ తరగతి నుంచి టెన్త్ వరకు స్టడీ సర్టిఫికెట్(ప్రైవేటు విద్యార్థులు మాత్రం తహశీల్దార్ ధ్రువీకరించిన నేటివిటీ సర్టిఫికెట్), రిజర్వేషన్ పొందేవారు తహశీల్దార్ జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం, అసిస్టెంట్ సివిల్ సర్జన్ స్థాయి వైద్యుడితో ధ్రువీకరించిన ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ సమర్పించాలి.40 శాతం వైకల్యం దాటినట్లుగా సర్టిఫికెట్ ఉండాలి. స్పోర్ట్స్ కోటాలో జిల్లా స్థాయి ఆపైన క్రీడా సర్టిఫికెట్, భద్రతాదళాల కోటాకు సర్టిఫికెట్ ఉండాలి. కౌన్సెలింగ్‌లో సీటు ఖరారైన వెంటనే ఈ పత్రాలన్నీంటి జెరాక్సు కాఫీలు మూడు సెట్లు అందజేయాలి. వీటితో పాటు 6 కొత్త పాస్ పోర్టు ఫోటోలను అందజేయాలి.
కౌన్సెలింగ్ తేదీలు
జూన్ 1న ఎంపీసీ, ఈఈటీ కోర్సులకు, బీసీ సీ లోని అన్ని గ్రూపుల విద్యార్థులకు కౌన్సెలింగ్ ఉంటుంది.2న బైపీసీ, సీజీటీలకు, 3న ఎంఈసీ, సీఈసీ గ్రూపులకు కౌన్సెలింగ్ జరుగుతుంది.