gurukul junior college
-
ఇంటర్లో గురుకులాల హవా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో చదివిన ఇంటర్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. ఇంటర్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. ఇంటర్ రెండో సంవత్సర ఫలితాల్లో 93.84 శాతం, మొదటి సంవత్సరం ఫలితాలలో 86.14 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 950కి పైగా మార్కులు పొంది న విద్యార్థుల సంఖ్య వందకు పైగా ఉంది. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలను 2,755 మంది విద్యార్థులు రాయగా వారిలో 2,544 మంది పాసయ్యారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో కొత్తగా ప్రారంభించిన ఒకేషనల్ కోర్సుల్లోనూ విద్యార్థులు తమ సత్తా చాటారు. నాగార్జునసాగర్‌లోని గురుకుల కాలేజీ ఫస్ట్, సెకండియర్ ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను, అధ్యాపకులను, సిబ్బందిని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కార్యదర్శి మల్లయ్య బట్టు అభినందించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల మెరుపులు.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి చెందిన విద్యార్థినీ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. ఫస్టియర్ విద్యార్థులు 88.03 శాతం ఉత్తీర్ణులు కాగా, రాష్ట్రవ్యాప్త ఉత్తీర్ణత 64.25% మాత్రమే కావడం గమనార్హం. 17 కాలేజీలు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాయి. సెకండియర్‌లో ఏకంగా 93.23 శాతం మంది (రాష్ట్ర ఉత్తీర్ణత 68.68%) ఉత్తీర్ణులయ్యారు. 41 కాలేజీలు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాయి. అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్లు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో చదివిన విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధించారు. సెకండియర్‌లో 82.09 శాతం, ఫస్టియర్‌లో 78.75 శాతం ఫలితాలు వచ్చాయి. తేజావత్ భావనశ్రీ 984 మార్కులతో సెకండియర్ టాపర్‌గా నిలిచారు. ఇక రాష్ట్రంలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో 94.18 సగటుతో ఉత్తీర్ణులై తమ ప్రత్యేకతను నిలుపుకున్నారు. విద్యార్థులను మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. మైనారిటీ గురుకులాల వివరాలు ఇంకా ప్రకటించలేదు. -
బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల గురుకుల జూనియర్ కాలేజీ (ఎంజేపీఏపీ బీసీఆర్‌జేసీ)ల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. ప్రస్తుతం పదో తరగతి చదువుతూ మార్చిలో పబ్లిక్ పరీక్షలు రాయబోయే విద్యార్థులు ప్రవేశాలకు అర్హులు. వీరు ఈ నెల 25 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశపరీక్షలో ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశం పొందే విద్యార్థి కుటుంబానికి ఏడాదికి రూ.లక్ష లోపు ఆదాయం ఉండాలి. ఈ మేరకు తహసీల్దార్ ఇచ్చిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 14 బీసీ గురుకుల కళాశాలలు.. 2,080 సీట్లు రాష్ట్రంలో మొత్తం 14 బీసీ గురుకుల కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఏడు బాలికలకు, ఏడు బాలురకు కేటాయించారు. బాలికలకు 1,000 సీట్లు ఉండగా.. బాలురకు 1,080 సీట్లు ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు పూర్తి వివరాలకు www. jnanabhumi. ap. gov. in చూడాలని బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణమోహన్ తెలిపారు. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ప్రవేశపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పదో తరగతి సిలబస్ నుంచి మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. మ్యాథమ్యాటిక్స్ నుంచి 20 ప్రశ్నలు (20 మార్కులు), ఫిజికల్ సైన్స్ నుంచి 20 ప్రశ్నలు (20 మార్కులు), బయోలాజికల్ సైన్స్ నుంచి 20 ప్రశ్నలు (20 మార్కులు), సోషల్ స్టడీస్ నుంచి 15 ప్రశ్నలు (15 మార్కులు), ఇంగ్లిష్ 15 ప్రశ్నలు (15 మార్కులు), లాజికల్ రీజనింగ్ 10 ప్రశ్నలు (10 మార్కులు) ఉంటాయి. మొత్తం 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. మార్చి 15న ఫలితాలు రాత పరీక్ష మార్చి 8న (ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు) జరుగుతుంది. మార్చి 15న ఫలితాలను ప్రకటిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఏప్రిల్ 15 నుంచి 17లోపు సీట్లు కేటాయిస్తారు. 75 శాతం సీట్లు బీసీ గురుకుల విద్యార్థులకే.. ఇంటర్మీడియెట్ మొదటి ఏడాది ప్రవేశాల్లో బీసీ–ఏలకు 20 శాతం, బీసీ–బీలకు 28 శాతం, బీసీ –సీలకు 3 శాతం, బీసీ –డీలకు 19 శాతం, బీసీ –ఈలకు 4 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, ఈబీసీలకు 2 శాతం, అనాధలకు 3 శాతం చొప్పున రిజర్వేషన్ ఉంటుంది. ప్రత్యేకించి మత్స్యకారుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన కాలేజీల్లో మత్స్యకార వర్గానికి చెందిన విద్యార్థులకు 46 శాతం, బీసీ–ఏలకు 7 శాతం, బీసీ–బీలకు 10 శాతం, బీసీ –సీలకు 1 శాతం, బీసీ –డీలకు 7 శాతం, బీసీ –ఈలకు 4 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, ఈబీసీలకు 1 శాతం, అనాధ పిల్లలకు 3 శాతం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తారు. అయితే.. మొత్తం మీద 75 శాతం సీట్లను బీసీ గురుకుల స్కూళ్లు, బీసీ హాస్టళ్లలో చదువుకున్న వారికే కేటాయిస్తారు. మిగిలిన 25 శాతం సీట్లలోకి ఇతర చోట్ల చదువుకున్న వారిని తీసుకుంటారు. -
శ్రీకాంత్ మృతిపై సీబీఐతో విచారణ చేపట్టాలి
సాక్షి, వనపర్తి: గురుకుల విద్యార్థి శ్రీకాంత్ మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని మాదిగ ఉద్యోగ సమాఖ్య రాష్ట్ర కో కన్వీనర్ గద్వాల కృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని యూటీఎఫ్ జి ల్లా కార్యాలయంలో గురుకుల విద్యార్థి మృతిపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మదనాపురం ఎస్సీ గురుకుల పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, అధ్యాపకులు వాస్తవాలను తొక్కిపెడుతున్నారని ఆరోపించారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఈ నెల 7న విద్యార్థి మృతి చెందితే.. విద్యార్థి, ప్రజా సంఘాలు, మృతుని తల్లిదండ్రుల కళాశాలను సందర్శించగా పలు అనుమానాలు వెలుగు చూసినట్లు గుర్తు చేశారు. తోటి విద్యార్థులు కొందరు అధ్యాపకులపై అనుమానాలు వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లో ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరుకావడం లేదని, రాత్రివేళల్లో విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంటుందని, పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని, రాత్రివేళలో చాలా మం ది విద్యార్థులు బయటకు వెళ్తున్నారని పలు గురుకులాల నుంచి రిపోర్టు అందిందన్నారు. కే వీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ అద్యక్షతన నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయా సంఘాల అధ్యక్షులు, నాయకులు వెంకటస్వామి, వెంకటయ్య, లక్ష్మయ్య, గట్టుస్వామి, నాగన్న, సన్నయ్య, భగత్, గంగన్న, నారాయణ, గణేష్, రాము, చెన్నకేశవులు, ప్రశాంత్, వంశీ, నిరంజన్, రవిప్రసాద్, వెంకటస్వామి, శ్రీనివాసులు, ఆంజనేయులు, అరవింద్, వీరప్ప పాల్గొన్నారు. సీబీఐతో విచారణ చేపట్టాలి పెబ్బేరు (కొత్తకోట): గురుకుల విద్యార్థి శ్రీకాంత్ మృతిపై సీబీఐ విచారణ చేయాలని మంగళవారం మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకుడు ప్రశాంత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాంత్‌ది ముమ్మాటికి హత్యనే అన్నారు. దీనిపై ప్రభుత్వం సీబీఐతో సమగ్ర విచారణ చేపట్టి కారుకులైన వారిని కఠినంగా శిక్షించడంతోపాటు విద్యార్థి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, తక్షణమే రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు అభి, ప్రసాద్, మహేష్ పాల్గొన్నారు. -
నేటి నుంచి గురుకుల జూనియర్ కళాశాలల్లో కౌన్సెలింగ్
ఆంధ్రా రీజియన్‌లోని తొమ్మిది జిల్లాలకు విజయవాడలో అన్ని గ్రూపుల్లో 770 సీట్లు పామర్రు : ఏపీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి జూన్ 1 నుంచి కొన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆంధ్రా రీజియన్ కౌన్సెలింగ్ కన్వీనర్, నిమ్మకూరు గురుకుల కళాశాల ప్రిన్సిపల్ ఎన్ సీతాపతి మంగళవారం తెలిపారు. నిమ్మకూరు గురుకుల కళాశాలలో ఆయన మాట్లాడుతూ ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారన్నారు. ఆంధ్ర రీజియన్‌లో 5 కాలేజీలు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాలు ఉన్నాయన్నారు. ఈ జిల్లాల విద్యార్థులను 5 కాలేజీల్లో తీసుకుంటారన్నారు. నాగార్జునన సాగర్‌లో బాలుర, కృష్ణాజిల్లా నిమ్మకూరులో బాల, బాలికలకు, నెల్లూరు జిల్లా వెంకటగిరిలో బాలురు, విజయనగరం జిల్లా వెంకటగిరిలో బాలురు, విజయనగరం జిల్లా తాడిపూడిలో బాలికలు, గుంటూరు మైనార్టీ బాలురకు కళాశాలలు ఉన్నాయన్నారు. సీట్ల వివరాలు ఐదు కళాశాల్లోనూ కలిపి ఎంపీసీ గ్రూపులో 278 సీట్లు, బైపీసీలో 201, సీఈసీ 104, ఎంఈసీలో 127 సీట్లు ఉన్నారుు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి సీజీటి, ఈఈటీ కోర్సులకు నిమ్మకూరు కళాశాలలో మాత్రమే 60 సీట్లు ఉన్నారుు. ఫీజుల వివరాలు సైన్సు గ్రూపుల నిర్వహణ ఫీజు రూ. వెయ్యి, రూ. 1050 ఎంఈసీ, సీఈసీ గ్రూపులకు నిర్వహణ ఫీజు వెయ్యి, రూ. 637 ఫీజును కౌన్సెలింగ్‌లో సీటు ఖరారైన వెంకటనే చెల్లించాలి. కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సిన ధ్రువీకరణపత్రాలు కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు ఒరిజనల్ సర్టిఫికెట్లను అధికారులకు చూపించాలి.పదో తరగతి గాని, తత్సమాన పరీక్ష మార్కుల లిస్టు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, 4వ తరగతి నుంచి టెన్త్ వరకు స్టడీ సర్టిఫికెట్(ప్రైవేటు విద్యార్థులు మాత్రం తహశీల్దార్ ధ్రువీకరించిన నేటివిటీ సర్టిఫికెట్), రిజర్వేషన్ పొందేవారు తహశీల్దార్ జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం, అసిస్టెంట్ సివిల్ సర్జన్ స్థాయి వైద్యుడితో ధ్రువీకరించిన ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ సమర్పించాలి.40 శాతం వైకల్యం దాటినట్లుగా సర్టిఫికెట్ ఉండాలి. స్పోర్ట్స్ కోటాలో జిల్లా స్థాయి ఆపైన క్రీడా సర్టిఫికెట్, భద్రతాదళాల కోటాకు సర్టిఫికెట్ ఉండాలి. కౌన్సెలింగ్‌లో సీటు ఖరారైన వెంటనే ఈ పత్రాలన్నీంటి జెరాక్సు కాఫీలు మూడు సెట్లు అందజేయాలి. వీటితో పాటు 6 కొత్త పాస్ పోర్టు ఫోటోలను అందజేయాలి. కౌన్సెలింగ్ తేదీలు జూన్ 1న ఎంపీసీ, ఈఈటీ కోర్సులకు, బీసీ సీ లోని అన్ని గ్రూపుల విద్యార్థులకు కౌన్సెలింగ్ ఉంటుంది.2న బైపీసీ, సీజీటీలకు, 3న ఎంఈసీ, సీఈసీ గ్రూపులకు కౌన్సెలింగ్ జరుగుతుంది.