ఉద్యమంలా హరితహారం | haritha haram like a movement | Sakshi
Sakshi News home page

ఉద్యమంలా హరితహారం

Published Fri, Jul 8 2016 4:18 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

ఉద్యమంలా హరితహారం - Sakshi

ఉద్యమంలా హరితహారం

నేటి నుంచి 22 వరకు మొక్కలు నాటే కార్యక్రమం
హరితహారంలో 3.35 కోట్ల మొక్కలు లక్ష్యం
నేడు బాన్సువాడలో  ప్రారంభించనున్న మంత్రి


సాక్షి ప్రతినిధి నిజామాబాద్ :  హరితహారం కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. మొక్కలు నాటేందుకు ఇదివరకే అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు హరితహారం సక్సెస్ కోసం మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్  డాక్టర్ యోగితారాణాలు ప్రజాప్రతినిధులు, అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 3.35 కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్దేశించారు. ఈ నేపథ్యంలో హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు నిర్వహించిన సమీక్షలు, సమావేశాల్లో నిర్దేశం చేశారు. 22 వరకు నిర్వహించే హరితహారంను బాన్సువాడ(దేశాయిపేట)లోని ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాల ఆవరణలో శుక్రవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మొక్కలు నాటి ప్రారంభిస్తారు.

3.35 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో 36 మం డలాలు, 718 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 3.35 కోట్ల మొక్కలు ఈ ఏడాది నాటేందుకు లక్ష్యంగా నిర్దేశించారు. జిల్లా వ్యాప్తంగా 2.75 కోట్ల మొక్కలు నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయి. మొక్కలను ఆర్‌అండ్‌బీ రహదారులు, పంచాయతీ రోడ్లు, చెరువు కట్టలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, గ్రామాల్లోని శివారు ప్రాంతాల్లో, ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, పశువైద్య కేంద్రాలు తదితర ప్రభుత్వ శాఖల పరిధిలో మొక్కలు నాటనున్నారు.  ఆర్‌అండ్‌బీ రహదారులు జిల్లాలో 200 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి.

పంచాయతీరాజ్ రోడ్లు 191 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. వీటికి ఇరువైపుల చెట్లను పెంచేందుకు ఇదివరకే మొక్కలను అధికారులు పం పిణీ చేశారు. 3.50 లక్షల ఈత చెట్లను గీత కార్మిక సంఘాలకు అందజేశారు. రోడ్లకు ఇరువైపు 23.54 లక్షల మొక్కలను నాటనున్నారు. నివాస ప్రాంతాల్లో 27.63 లక్షల మొక్కలు, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 3 లక్షలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో 12.75 లక్షలు, కమ్యూనిటీ స్థలాల్లో 40.35 లక్షలు, హౌసింగ్ కాలనీల్లో 99 వేలు, అటవీప్రాంతంలో 44.59 లక్షలు, ఇతర ప్రాంతాల్లో 3.35 కోట్ల మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించారు.

 అందరి భాగస్వామ్యంతో..
హరితహారం విజయవంతంగా చేపట్టేందుకు కలెక్టర్ యోగితారాణా అధికారులకు బాధ్యతలను అప్పగిం చారు. ఫారెస్టు డీఎఫ్‌వో, డ్వామా పీడీ, హార్టికల్చరల్ డిప్యూటీ డెరైక్టర్, మున్సిపల్ కమిషనర్లు నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్, కామారెడ్డి టెరి టోరియల్ డీఎఫ్‌వోలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. వీరిపై జిల్లా కలెక్టర్ యోగితారాణా, జాయింట్ కలెక్టర్లు ఉంటారు. అంతేకాకుండా ఆర్‌డీవో, తహసీల్దార్లు, ఇంజనీర్లు, ఎంపీడీవోలు, డీఆర్‌వోలు, కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది అందరు భాగస్వామ్యం అవుతారు. ప్రతి మండలానికి ఒక చేంజ్ ఏజెంట్లను నియమించారు.

తహసీల్దార్‌ను  ఎంపీడీవోలు, ఈవోపీఆర్‌డీలు, ఎం ఈవోలు అన్ని విభాగాల ఇంజనీర్లు, సహాయ ఇంజనీర్లు, ఉద్యానవన అధికారులు, పోలీసు, ఎక్సైజ్ అధికారులను మండలాల చేంజ్ ఏజెంట్లుగా నియమించబడ్డారు. పారామెడికల్ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామ సంఘాలు , విద్యాసంస్థలు, యువజన సంఘాలు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు మెంబర్లు , ఉపాధి హామీ మేట్లు, గ్రామ నోడల్ అధికారులు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌ఏలు, ఉద్యోగులకు గ్రామాలను దత్తత ఇచ్చి మొక్కలు నాటింపజేశారు. అధికారులకు మొక్కలను అందజేశా రు.  హరితహారంను సక్సెస్ చేసేందుకు ముందుగానే కార్యాచరణ సిద్ధం కాగా.. అన్ని పథకాల అమలులో ప్రత్యేకతను చాటుకుంటున్న జిల్లాను హరితహారంలోను ముందుండేలా ముందుకు సాగుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement