స్నేహితుడిని కాపాడబోయి.. మత్యుఒడిలోకి
స్నేహితుడిని కాపాడబోయి.. మత్యుఒడిలోకి
Published Tue, Aug 2 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
నాయుడుపేట : ప్రమాదం బారిన పడుతున్న స్నేహితుడిని కాపాడబోయిన ఓ వ్యక్తి తానే మత్యుఒడిలోకి జారుకున్న సంఘటన నాయుడుపేట రైల్వేస్టేషన్ పరిధిలోని విన్నమాల గేట్ వద్ద మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నాయుడుపేట మండల పరిధిలోని విన్నమాల పంచాయతీకి చెందిన దార్ల గిరి (27) తన స్నేహితులతో కలిసి పట్టణంలోనికి వచ్చేందుకు రైల్వే ట్రాక్ దాటుతున్నాడు. అంతలోనే రైలు అతివేగంగా వస్తుండటంతో ఉలికిపడ్డ స్నేహితులు కొంతమంది ముందుకు పరుగులు తీశారు. మరో స్నేహితుడు రైల్వే ట్రాక్‌పై పడ్డాడు. ఇది గుర్తించిన గిరి అతడి చేయిపట్టుకుని పక్కకు లాగేశాడు. ఈ క్రమంలో గిరి వెళ్లి ట్రాక్‌పడ్డాడు. అదే సమయంలో రైలు ఢీకొని మత్యువాతపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్నేహితులు రైల్వేస్టేషన్ మాస్టార్‌కు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్థానిక వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు మతదేహాన్ని అందించారు. మతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇంటిపెద్ద మరణించడంతో వారంతా వీధినపడ్డారు. స్నేహితుడిని కాపాడబోయి గిరి దుర్మరణం చెందడం స్థానికులను కంటతడి పెట్టించింది.
Advertisement
Advertisement