ఒక్క రోజులో 1,00,699 మంది భక్తుల రాక
సాక్షి,తిరుమల: రథసప్తమి పర్వదిన సందర్భంగా ఆదివారం తిరుమల భక్తులతో కిక్కిరిసింది. రికార్డు స్థాయిలో 1,00,699 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. టీటీడీ చరిత్రలో ఒక రోజులో ఇంత మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం ఇదే తొలిసారని తెలిపింది. గత ఏడాది రథసప్తమి రోజున 92,021 మంది భక్తులు దర్శించుకోగా, ఈ సారి మరో ఎనిమిది వేల మంది అదనంగా దర్శించుకొన్నారని పేర్కొంది. అలాగే 2.5 లక్షల మందికిపైగా భక్తులు ఉత్సవమూర్తులను దర్శించుకున్నట్లు టీటీడీ వెల్లడించింది.