నగరంలోకి భారీ వాహనాలు నిషేధం
కర్నూలు: కర్నూలు నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పోలీసు అధికారులు దష్టి సారించారు. రోజు రోజుకు వాహనాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా రోడ్లు విస్తరించకపోవడంతతో తరచూ ట్రాఫిక్ జామ్ అవుతూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భారీ వాహనాలను నగరంలోకి రాకుండా నిషేధం విధించారు. ప్రమాదాల నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర తెలిపారు. కర్నూలు నగరంలోకి ప్రవేశించే భారీ వాహనాలు లారీలు, ట్రాక్టర్లు, సివిల్ సపై ్ల లారీలు, టిప్పర్లు, ఇసుక, రాళ్ల ట్రాక్టర్లు, కమర్షియల్ భారీ వాహనాలపై నిషేధం ప్రకటించినట్లు వెల్లడించారు. పోలీసు నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాలు ప్రవేశిస్తే చట్టప్రకారం రూ.2 వేల జరిమానా విధించి వాహనాన్ని స్వాధీనం చేసుకుని రవాణా శాఖకు అప్పగించనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే నగరంలోకి భారీ వాహనాలను అనుమతిస్తామని, ప్రజలు, వాహన యజమానులు పోలీసు శాఖకు సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.