సంగమేశ్వరం వద్ద పోటెత్తిన కృష్ణాజలాలు
సంగమేశ్వరం వద్ద పోటెత్తిన కృష్ణాజలాలు
Published Tue, Oct 4 2016 10:41 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
కొత్తపల్లి: నెలన్నర క్రితం కృష్ణాపుష్కరాలను పురష్కరించుకుని నిర్మించిన ఘాట్లు (ఐదుమెట్లుమినహా)మునకకు గురయ్యాయి. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదనీటితో శ్రీశైలం జలాశయం 882.7 అడుగులకు చేరింది. ఇదే ప్రవాహం కొనసాగితే నేడు రేపటిలోపు సంఘమేశ్వరం ఎగువఘాటులోని ఉమామహేశ్వరుని పాదాల చెంతకు కృష్ణాజలాలు చేరే అవకాశం ఉంది. ఏపీటూరిజం టెంట్‌హౌస్‌లు కూడా మునిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే పిండప్రదాన పుష్కరఘాటు కృష్ణమ్మ అలల తాకిడికి ఛిద్రమైంది. సంగమేశ్వర క్షేత్రాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని హామీచ్చిన జిల్లా కలెక్టర్ పుష్కరాల తరా్వత ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం ఈ క్షేత్రం పరిసరప్రాంతాలు బోసిపోతున్నాయి.
Advertisement