ఫిట్‌నెస్ కోసం అనుకరణలు వద్దు: సునీల్ | Hero sunil visits vibration fitness studio in visakhapatnam | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్ కోసం అనుకరణలు వద్దు: సునీల్

Published Fri, Dec 4 2015 9:55 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

ఫిట్‌నెస్ కోసం అనుకరణలు వద్దు: సునీల్ - Sakshi

ఫిట్‌నెస్ కోసం అనుకరణలు వద్దు: సునీల్

ఒకరితో పోల్చుకోవద్దు
ఆరోగ్యసూత్రాలు పాటించాలి

 
 
విశాఖపట్నం : సినీ నటుడు సునీల్ గురువారం నగరాన్ని సందర్శించి అభిమానుల తో ముచ్చటించి సందడి చేశారు. రామ్‌నగర్‌లోని వైబ్రేషన్స్ ఫిట్‌నెస్ స్టూడియోను సందర్శించి అక్కడ ఉన్న అభిమానులతో కాసేపు మాట్లాడుతూ ఫిట్‌నెస్‌కు సంబంధించిన అంశాలపై సూచనలు, సలహాలిచ్చారు. ఈ సందర్భంగా ఫిట్‌నెస్ స్టూడియో కు వచ్చే అందరికీ తాను ఇన్‌స్పిరేషన్ కావాలనే ఉద్దేశ్యంతో జిమ్ నిర్వాహకుడు రాజేష్ సునీ ల్ చేతుల మీదుగా ఆయన సంతకంతో కూడిన ఒక ఎక్సర్‌సైజ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వెయిట్ లాస్, డైట్ ఆపైన సిక్స్‌ప్యాక్ వంటి వ్యాయామాల చిట్కాలకు సంబంధించిన విషయాలపై అభిమానులతో పంచుకున్నారు.
 
నేటి నగరజీవి యాంత్రిక జీవనంలో వ్యాయామం అనేది ఒక భాగం చే సుకోవాలని సూచించారు. అయితే ఈ మధ్యకాలంలో యువత తక్కు వ కాలంలో వారి హీరో లేదా హీ రోయిన్‌లా మారిపోవాలని లేదా కనిపించాలని వారి ఆహారపు అలవాట్లును ఇష్టానుసారంగా మార్చుకుంటున్నారని ఈ పద్ధ తి మంచిది కాదని సూచించా రు. బరువు తగ్గి నాజుగ్గా కన్పిం చడానికి ఒక ప్రక్రియ ఉందన్నారు.

దాని కోసం ఒక ట్రైనర్, డా క్టర్, న్యూట్రీషనిస్ట్‌తో కూడిన ఒక బృందం ఉంటుందని వారి సూచనలు, సలహాలమేరకు మన శరీరానికి అనుకూలమైన వ్యాయామం, డైట్‌ను డిజైన్ చేసినట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చని పేర్కొన్నారు.
 
 అంతేకాకుండా కోరుకున్న హీరో, హీరోయిన్ కన్నా బాగా తయారుకాగలమన్నారు. అనంతరం వాకర్, స్రింగ్ వంటి ఎక్సర్‌సైజ్‌లు చేసి అభిమానులను అలరించారు.  వైబ్రేషన్ సంస్థ నిర్వహకుడు రాజేష్, బీజేపీ నగర ఉపాధ్యక్షుడు పరశురామరాజు, రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్-3020 అసిస్టెంట్ గవర్నర్ పి.ఎల్.కె.మూర్తి, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement