ఎస్కేయూ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి. ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఏవీ శేషసాయి శనివారం అనంతపురానికి వచ్చేస్తున్నారు. విజయనగర లా కళాశాలలో ‘ప్రొసీడరియల్ లా అండ్ ఇట్స్ ప్రాక్టికల్ డైమెన్సెస్ ఇన్‌క్లూడింగ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్’ అనే అంశంపై జరగనున్న జాతీయ సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సులో జిల్లా జడ్జి ఏ. హరిహరనాథ శర్మతో పాటు ఎస్కేయూ వీసీ రాజగోపాల్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ. నరసింహారెడ్డి హాజరుకానున్నారు.